ఒక కథ మొదలైతే సినిమా ఇండస్ట్రీలో చాలా మంది హీరోల తలుపు తట్టడం సహజం. రీసెంట్ గా మారుతి సెట్ చేసుకున్న కథ కూడా అదే తరహాలో ఒక హీరో నుంచి మరో హీరో దగ్గరికి షిఫ్ట్ అయినట్లు తెలుస్తోంది. శైలజా రెడ్డి అల్లుడు సినిమాతో ప్లాప్ అందుకున్న మారుతి నెక్స్ట్ హీరో కోసం గత కొంత కాలంగా వేట సాగిస్తున్నాడు. 

బలే బలే మగాడివోయ్ కాంబో రిపీట్ చెయ్యాలని గీత ఆర్ట్స్ మరోసారి నాని దగ్గరికి మారుతిని పంపగా నాని ఇతర ప్రాజెక్టులతో బిజీగా ఉన్నట్లు చెప్పి డ్రాప్ అయ్యాడు. అయితే ఇప్పుడు అదే స్టోరీని సాయి ధరమ్ తేజ్ చేయడానికి సిద్దమైనట్లు తెలుస్తోంది. అసలే మనోడికి హిట్టు లేదు. మారుతి సినిమాలపై కూడా జనాలు ఎంతవరకు ఆసక్తి చూపుతారనేది సందేహమే. 

అయితే గతంలో కూడా నాని రిజెక్ట్ చేసిన చిత్రలహరి సినిమాను సాయి ధరమ్ తేజ్ చేసేందుకు ఒప్పుకున్నాడు. నేను శైలజా దర్శకుడు కిషోర్ తిరుమల ఆ సినిమాను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు సాయి చేతిలో ఉన్న రెండు సినిమాలు నాని రిజెక్ట్ చేసినవే. అతని కోసమే దర్శకులు కథను సిద్ధం చేయగా అనుకోని విధంగా చేయలేకపోయాడు. మరి సాయి ఈ సినిమాలతో ఏ లెవెల్లో సక్సెస్ అందుకుంటాడో చూడాలి.