అందరితో పోటీపడుతూ పవన్ ను అభిమానించే సాయి జనసేన కోసం ప్రచారం చేస్తారా? చేయరా? అనే కథనాలు ఇటీవల చాలా వైరల్ అయ్యాయి. అయితే ఈ విషయంలో ఫైనల్ గా సాయి ధరమ్ తేజ్ క్లారిటీ ఇచ్చాడు. 

టాలీవుడ్ యువ హీరో సాయి ధరమ్ తేజ్ చిత్ర లహరి సినిమాతో ఈ సారి మంచి హిట్ కొట్టేలా ఉన్నాడు. ఇకపోతే మెగా ఫ్యామిలిలో అందరితో పోటీపడుతూ పవన్ ను అభిమానించే సాయి జనసేన కోసం ప్రచారం చేస్తారా? చేయరా? అనే కథనాలు ఇటీవల చాలా వైరల్ అయ్యాయి. అయితే ఈ విషయంలో ఫైనల్ గా సాయి ధరమ్ తేజ్ క్లారిటీ ఇచ్చాడు. 

చిత్రలహరి సినిమా రిలీజవుతున్న సందర్బంగా తిరపతి వెళ్లి శ్రీవారి దర్శనం చేసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. జనసేన కోసం ప్రచారం చేయడం నాకు ఇష్టమే అయినప్పటికీ పవన్ మామయ్య నాకు అందుకు అనుమతి ఇవ్వలేదు. ఎందుకంటే రాజకీయాలు - సినిమాలు అనే పడవలపై అటో కాలు.. ఇటో కాలు వేసి ప్రయాణించడం చాలా కష్టమని అందుకే ఆయన అనుమతి ఇవ్వలేదని అన్నారు. 

అంతే కాకుండా పవన్ కళ్యాణ్ మామయ్య మాటను కాదని తాను ఏ పని చేయలేను అని సాయి ధరమ్ తేజ్ వివరణ ఇచ్చాడు. దీంతో జనసేన ప్రచారాల్లో సాయి కనిపించడు అని ఒక క్లారిటీ అయితే వచ్చింది. ఇక పవన్ కళ్యాణ్ భీమిలి - గాజువాక అసెంబ్లీ స్థానాల నుంచి పోటీ చేస్తోన్న సంగతి తెలిసిందే.