ఇండియన్ క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ని ఎంతోమంది స్పూర్తిగా తీసుకుంటారు. ఆయన చేసే పనులు చాలా మందిని ఇన్స్పైర్ చేస్తుంటాయి.నిన్న జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ 'ఫిట్ ఇండియా మూమెంట్' కార్యక్రమానికి పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమానికి సచిన్ మద్దతు పలికారు. ఈ క్రమంలో గురువారం మెహబూబా స్టూడియోలో ఓ కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చిన సచిన్ క్రికెట్ ఆడారు. తనతో పాటు క్రికెట్ ఆడతారా అని బాలీవుడ్ నటులు వరుణ్ ధావన్, అభిషేక్ బచ్చన్ లను ఆహ్వానించడంతో వారు ఆశ్చర్యపోయారు. మొదట సచిన్ బ్యాటింగ్ చేయగా.. వరుణ్, అభిషేక్ బౌలింగ్ చేశారు.

ఆ తరువాత వారిద్దరికీ సచిన్ బౌలింగ్ చేయడంతో పాటు అక్కడే ఉన్న జియా అనే యువ క్రికెటర్ తో వరుణ్ కి బౌలింగ్ చేయించాడు. ‘స్పోర్ట్స్‌ ప్లేయింగ్‌ నేషన్’‌, ‘ఫిట్‌ ఇండియా మూవ్‌మెంట్‌’హ్యాష్ ట్యాగ్ లను జత చేసి వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు సచిన్. చేసే పనిలో ఆటల్ని భాగం చేసుకోవాలని సూచించాడు. 

ఈ పోస్ట్ పై స్పందించిన వరుణ్.. క్రీడా దినోత్సవం సందర్భంగా గొప్ప చొరవ చూపారు సర్‌ అంటూ ప్రశంసించాడు. అలానే అభిషేక్ కూడా సచిన్ ని ప్రసంశించారు. నిన్నటి నుండి ఎగ్జైట్మెంట్ ని కంట్రోల్ చేసుకోలేకపోతున్నా.. నా కల నిజమైందంటూ చెప్పుకొచ్చారు.