శేఖర్ కమ్ముల డైరెక్షన్లో తెరకెక్కిన ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’లో  నాగరాజు గా కనపించిన సుధాకర్ గుర్తిండే ఉండి ఉంటారు. అతను హీరోగా నిత్య  అనే కొత్త అమ్మాయి హీరోయిన్ గా  హరినాథ్ బాబు దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'నువ్వు తోపురా' .   ఈ సినిమా నుంచి ఒక ట్రైలర్ ను 'ప్రభాస్' చేతుల మీదుగా రిలీజ్ చేయించారు. ఒక తెలంగాణ కుర్రాడి జర్నీగా.. మాస్ అంశాలతో ఈ సినిమా నిర్మితమైందనే విషయం ఈ ట్రైలర్ ను బట్టి అర్థమవుతోంది.

ఆద్యంతం ఆసక్తికరంగా సినిమాని తెరకెక్కించనట్టు సినిమా ట్రైలర్ చెబుతోంది. లవ్ .. యాక్షన్ .. ఎమోషన్ కి సంబంధించిన సన్నివేశాలపై కట్ చేసిన ట్రైలర్, యూత్ ను ఆకట్టుకునేలా వుంది. సీనియర్ హీరోయిన్ నిరోషా కీలకమైన పాత్రను పోషించిన ఈ సినిమాను, మే 3వ తేదీన విడుదల చేయనున్నారు.  ఈ లోగా ఈ చిత్రం ట్రైలర్ ని చూడండి.