సాహో సినిమా కోసం దేశమంతా ఎంతో ఆతృతగా ఎదురుచూస్తోంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. బాహుబలి సినిమాతో ఇండియన్ బాక్స్ ఆఫీస్ ని షేక్ చేసిన ప్రభాస్ సాహో ద్వారా కూడా అదే తరహాలో రికార్డులు బద్దలు కొడతాని అంతా భావిస్తున్నారు. ఇప్పటికే సినిమా టీజర్ పోస్టర్స్ అంచనాలను భారీగా పెంచేశాయి. 

రోజుకో డిఫరెంట్ పోస్టర్ తో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ తో హడావుడి గట్టిగానే చేస్తోంది. రీసెంట్ గా రిలీజైన మరో పోస్టర్ కూడా సాహో ఫ్యాన్స్ ని చూపు తిప్పుకోనివ్వడం లేదు. దిట్టంగా ఉండే కరేబియన్ రౌడీలు ప్రభాస్ వెనకాల రాక్షసుల్లా కనిపించడం భయానకంగా ఉంది. అలాగే ప్రభాస్ ఒక ధీరుడి లా కనిపించడం చూస్తుంటే సినిమాలో ఆ ఫైట్ రోమాలు నిక్కబొడిచేలా చేస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. 

టాలీవుడ్ చరిత్రలో అత్యధిక భారీ యాక్షన్ సీన్స్ తో రూపొందిన సాహోలో ప్రతి యాక్షన్ సీన్ హాలీవుడ్ సినిమాలను తలపిస్తాయట. దర్శకుడు సుజీత్ ఎలాంటి యాక్షన్ ట్రీట్ రెడీ చేశాడో తెలియాలంటే ఆగస్ట్ 30వరకు వెయిట్ చేయాల్సిందే. యువీ క్రియేషన్స్ నిర్మించిన ఈ సినిమాలో శ్రద్దా కపూర్ హీరోయిన్ గా నటించింది.