‘బాహుబలి’ చిత్రం తరువాత సుమారు రెండేళ్ల గ్యాప్ తీసుకుని ప్రభాస్ నటించిన సినిమా కావడంతో 'సాహో'పై భారీ అంచనాలు నెలకొన్నాయి. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో ప్యాన్ ఇండియా చిత్రంగా సుమారు 10 వేల థియేటర్స్‌లో ఈ సినిమాను విడుదల చేశారు.

ఈ సినిమాను చూడడానికి సామాన్య ప్రజలతో పాటు సెలబ్రిటీలు సైతం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ‘సాహో’ చిత్రానికి గ్రాండ్ వెల్కమ్ చెబుతూ.. నాని, సాయి ధరమ్ తేజ్, జగపతిబాబు, వరుణ్ తేజ్ ఇలా చాలా మంది సెలబ్రిటీలు సోషల్ మీడియాలో పోస్ట్ లు పెడుతున్నారు.