ఎస్పీ బాలసుబ్రమణ్యం ఆరోగ్యంపై చెన్నై ఎంజీఎం ఆసుపత్రి వర్గాలు హెల్త్ బులెటిన్ విడుదల చేశాయి. ఎక్మో, వెంటిలేటర్ ఇతర ప్రాణాధార చికిత్స అందిస్తున్నామని వైద్యులు తెలిపారు.

ప్రస్తుతం ఆయన ఆరోగ్యం అత్యంత విషమంగా వుందని వెల్లడించారు. వైద్య నిపుణుల బృందం ఆయన ఆరోగ్యాన్ని నిరంతరం పర్యవేక్షిస్తోందని బులెటిన్‌‌లో ప్రస్తావించారు. గత 24 గంటల్లో ఎస్పీ ఆరోగ్యం తీవ్రంగా క్షీణించిందని ఎంజీఎం వర్గాలు తెలిపాయి.

కరోనా నుంచి కోలుకున్నాకా ఆయనకు మరోసారి అనారోగ్యం తిరగబెట్టింది. ఈ నెల 19 నుంచి బాలు ఆరోగ్యంపై ఎంజీఎం ఆసుపత్రి వర్గాలు హెల్త్ బులెటిన్‌ విడుదల చేయలేదు. దీంతో ఆయన ఆరోగ్యంపై కాసేపట్లో హెల్త్ బులెటిన్ విడుదల కానుంది. 

ఆగస్టు 5న కరోనా వైరస్ బారిన పడిన ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం  చెన్నై లోని ఎంజీఎం ఆస్పత్రిలో చేరిన సంగతి తెలిసిందే. రోజూ ఆయన ఆరోగ్యంపై ఎంజీఎం ఆస్పత్రి వైద్యులు హెల్త్ బులిటెన్ ను విడుదల చేస్తున్నారు.

అదేవిధంగా రోజూ తండ్రి ఆరోగ్య పరిస్థితి  ఆయన కుమారుడు ఎస్పీ చరణ్  సోషల్ మీడియా వేదికగా వివరిస్తున్నారు . అయితే కరోనా పాజిటివ్ వచ్చిన తర్వాత ఊపిరితిత్తులలో ఇన్ఫెక్షన్ పెరగటంతో అప్పట్లో ఆయన ఆరోగ్యం క్షీణించింది