అజయ్ భూపతి తెరకెక్కించిన 'ఆర్ ఎక్స్ 100' సినిమా కుర్రాళ్ల కి ఒక రేంజ్ లో కనెక్ట్  అయింది. విడుదలైన ప్రతి ప్రాంతంలోను ఈ సినిమా వసూళ్ల వర్షం కురిపించింది. ఆ విజయ ప్రస్దానం అక్కడితో ఆగలేదు. ఈ సినిమా రీసెంట్ గా టీవిలో ప్రీమియర్ షో వేస్తే అక్కడ కూడా టీఆర్పీలతో సంచలనం సృష్టించింది. స్టార్ మాటీవిలో ప్రసారమైన ఈ సినిమాకు  11.4 రేటింగ్స్ రావటం జరిగింది. అక్కడిదాకా బాగానే ఉంది. ఇప్పుడీ చిత్రం టీఆర్పీలను నాగ్,నాని కలిసి నటించిన దేవదాసు సినిమా టీఆర్పీలో పోలుస్తున్నారు.

దేవదాసు సినిమాకు 8.3 టీఆర్పీ వచ్చింది. నిజానికి ఇది మంచి టీఆర్పీనే. అయితే  'ఆర్ ఎక్స్ 100' తో పోలిస్తే చాలా తక్కువ. ఈ విషయం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.  'ఆర్ ఎక్స్ 100'  సినిమాకు టీవీలో ఆ స్దాయి టీఆర్పీ వస్తుందని మొదట ఎవరూ భావించలేదు. ఫ్యామిలీలతో ఈ సినిమా ఎలా చూస్తారు..ఏదోదియోటర్స్ లో యూత్ చూసారు కానీ అనే కామెంట్స్ వినపడ్డాయి.

అదే సమయంలో దేవదాసు సినిమా బయిట ఓకే అనిపించుకున్నా, నానికు, నాగ్ కు బుల్లితెరపై ఉన్న ఆదరణ, మహిళలలో ఉన్న క్రేజ్ తో ఈ సినిమా టీఆర్పీలు దుమ్ము రేపుతుందనుకున్నారు. అయితే సీన్ రివర్స్ అయ్యింది. టీవీల్లో  'ఆర్ ఎక్స్ 100' లాంటి సినిమాలు కూడా చూస్తున్నారని రుజువైంది. దాంతో ఇక నుంచి ఇలాంటి సినిమాలు కూడా ధైర్యంగా కొనచ్చు అని టీవీ మీడియా భావించే అవకాసం ఉంది.