బాలీవుడ్ మన డైరెక్టర్లంటే పడి చస్తుంది. ఇప్పటికే ఇక్కడి నుంచి బాలీవుడ్ కు వెళ్లి చాలాంమంది దర్శకులు హిట్ సినిమాలు ఇస్తున్నారు. ఇక ఇప్పుడు మరో టాలెంటెడ్ డైరెక్టర్ కు ఆఫర్ ఇచ్చింది బీ టౌన్. 

టాలీవుడ్ సినిమా రేంజ్ మారిపోయింది. ఇక్కడి సినిమాలే కాదు.. ఇక్కడి హీరోలు, డైరెక్టర్లంటే పడిచస్తున్నారు బాలీవుడ్ జనాలు. అందుకే టాలీవుడ్ నుంచి వరుసగా బాలీవుడ్ కు వలసకడుతున్నారు. సందీప్ వంగా,  గౌతమ్ తిన్ననూరి లాంటి దర్శకులు అక్కడ సినిమాలు చేస్తున్నారు. ఇప్పుడు మరో దర్శకుడు ఆర్ ఎక్స్ 100 ఫేమ్ అజయ్ భూపతి కూడా  బాలీవుడ్ కు వెళ్లబోతున్నట్టు తెలుస్తోంది.  

ఆర్ఎక్స్ 100  సినిమాతో టాలీవుడ్‌కు అదిరిపోయే హిట్టు అందించాడు అజ‌య్ భూప‌తి . ఈ సినిమా బాక్సాపీస్ వ‌ద్ద మ్యూజిక‌ల్ బ్లాక్ బాస్ట‌ర్ హిట్‌గా నిలిచి. బోల్డ్ కంటెంట్ తో.. అదిరిపోయే లవ్ స్టోరీతో తెరకెక్కిన ఈసినిమా నిర్మాత‌లకు కాసుల వ‌ర్షం కురిపించింది. ఈ సినిమా వచ్చి చాలా కాలం అవుతున్నా.. ఇంకా ఆ ప్రభావం యూత్ నుంచి తగ్గలేదు. ఇక ఆ త‌రువాత భూపతి.. చాలా గ్యాప్ తరువాత  శ‌ర్వానంద్‌, సిద్దార్థ్‌తో క‌లిసి తెర‌కెక్కించిన మ‌హాస‌ముద్రం డిజాస్టర్ గా నిలిచి నిరాశపరిచింది. దాంతో మరోసారి అజయ్ కు బ్రేక్ రాలేదు. 

ఈ టాలెంటెడ్ డైరెక్ట‌ర్ త్వ‌ర‌లోనే బాలీవుడ్  ఎంట్రీ ఇవ్వ‌బోతున్నాట్టు ఫిల్మ్ నగర్ సర్కిల్ లో  టాక్ గట్టిగా నడుస్తుంది. ప్రస్తుతం ఈ న్యూస్ టాక్ ఆఫ్ ది ఇండ‌స్ట్రీగా మారింది. అజ‌య్ భూప‌తి డైరెక్ట్ చేసిన రెండు సినిమాల‌తో ఇంప్రెస్ అయ్యాడ‌ట బాలీవుడ్ స్టార్ డైరెక్ట‌ర్ రాజ్ కుమార్ హిరానీ . ఈ స్టార్ డైరెక్ట‌ర్ అజ‌య్ భూప‌తిని బాలీవుడ్‌కు ప‌రిచ‌యం చేసేందుకు ప్లాన్ చేస్తున్నాడ‌ని టాక్ న‌డుస్తోంది.

తాను రాసిన క‌థ‌ను డైరెక్ట్ చేయాల‌ని అజ‌య్‌తో హిరానీ ఇప్ప‌టికే చ‌ర్చించాడ‌ని వార్త గుప్పుమంది. రాజ్ కుమార్ లాంటి డైరెక్టర్ ను ఆకట్టుకోవడం అంటే మామూలు విషయం కాదు అంటూ... ఓ వార్త ఇపుడు ఫిలింన‌గ‌ర్ లో హ‌ల్ చ‌ల్ చేస్తోంది. రాజ్ కుమార్ హిరానీ ప్ర‌స్తుతం షారుక్‌ఖాన్‌తో చేస్తున్న‌ డుంకీ సినిమా షూటింగ్‌తో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా తరువాత అజయ్ డైరెక్షన్ లో మూవీ రాబోతున్నట్టు సమాచారం.  మ‌రి ఈ స్టార్ డైరెక్ట‌ర్ సార‌థ్యంలో అజ‌య్ భూప‌తి బాలీవుడ్ ఎంట్రీ నిజమేనా..? అసలే ఏం లేకుండా వార్త ఎందుకు బయటకు వస్తుంది. నిప్పు లేనిదే పొగరాదు కదా..? అయినా సరే అఫీసియల్ అనౌన్స్ మెంట్ వచ్చే వరకూ వెచి చూడాల్సిందే.