బాలీవుడ్ లో గత కొంత కాలంగా వైరల్ అవుతున్న విషయం మలైకా రెండవ వివాహం. మలైకా అరోరా తెలుగువారికి కూడా సుపరిచతమే. గబ్బర్ సింగ్ లో కెవ్వు కేక అంటూ అందరిని ఆకట్టుకున్న అమ్మడు ఇప్పుడు తనకంటే 12 ఏళ్ళు చిన్నవాడైన నటుడిని పెళ్లి చేసుకోవడానికి సిద్ధమైంది. 

బోణి కపూర్ మొదటి భార్య కొడుకు అర్జున్ కపూర్ మలైకా అరోరాతో గత కొంత కాలంగా డేటింగ్ చేస్తున్నాడు. అయితే ఇప్పుడు వీరి వివాహంకు డేట్ ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. ఏప్రిల్ 19న క్రిస్టియన్ పద్దతిలో చర్చ్ లో ఒకటవుతారని బాలీవుడ్ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. 

ఐటెమ్ సాంగ్స్ తో బాగా పాపులర్ అయిన మలైకా మొదట సల్మాన్ సోదరుడైన అర్బజ్ ఖాన్ ని పెళ్లి చేసుకుంది. 19 ఏళ్ల తరువాత విభేదాలతో చట్టప్రకారం 2017లో విడిపోయిన వీరిద్దరికి 16 ఏళ్ల బాబు ఉన్నాడు. ఇక ఇప్పుడు తనకంటే చిన్నవాడైన అర్జున్ ని మలైకా పెళ్లి చేసుకోవడానికి సిద్ధమైంది. సోషల్ మీడియాలో ప్రస్తుతం వీరిపై ట్రోల్స్ ఓ రేంజ్ లో వైరల్ అవుతున్నాయి.