Asianet News TeluguAsianet News Telugu

అల్లు అర్జున్, అట్లీ సినిమా ఆగిపోయిందా..కారణం భారీ రెమ్యునరేషన్, చుక్కలు చూపించే డిమాండ్లు ?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప 2 తర్వాత చేయబోయే చిత్రం ఏంటో స్పష్టత రావడం లేదు. పుష్ప 2 వాయిదా పడ్డట్లు వార్తలు వస్తున్నాయి. ఇంతలోనే బన్నీ ఫ్యాన్స్ కి షాకిచ్చే మరో రూమర్ వైరల్ గా మారింది.

Rumours on Allu Arjun and atlee combination dtr
Author
First Published Jun 16, 2024, 6:00 PM IST

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప 2 తర్వాత చేయబోయే చిత్రం ఏంటో స్పష్టత రావడం లేదు. పుష్ప 2 వాయిదా పడ్డట్లు వార్తలు వస్తున్నాయి. ఇంతలోనే బన్నీ ఫ్యాన్స్ కి షాకిచ్చే మరో రూమర్ వైరల్ గా మారింది. పుష్ప 2 తర్వాత బన్నీ లైనప్ లో ఉన్న దర్శకుల్లో స్టార్ డైరెక్టర్ అట్లీ కూడా ఉన్నారు. 

అయితే అట్లీతో చర్చలు ఇప్పటి వరకు కొలిక్కి రాలేదు. అట్లీ, అల్లు అర్జున్ కాంబినేషన్ అంటే భారీ పాన్ ఇండియా చిత్రమే అవుతుంది. అందులో సందేహం లేదు. ఆల్రెడీ అట్లీ జవాన్ చిత్రంతో పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ అందుకున్నారు. 

కానీ తాజాగా అట్లీ, అల్లు అర్జున్ చిత్రం ఆగిపోయినట్లు వార్తలు వస్తున్నాయి. అట్లీ భారీగా రెమ్యునరేషన్ డిమాండ్ చేయడమే ఇందుకు కారణం అని అంటున్నారు. అంతే కాదు కొన్ని డిమాండ్లు కూడా పెట్టాడట. జవాన్ చిత్రానికి అట్లీ 40 కోట్ల వరకు రెమ్యునరేషన్ అందుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పుడు అంతకి మించి కావాలంటున్నాడట. 

అదే విధంగా ప్రాఫిట్స్ తో షేరింగ్ కూడా డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అదే విధంగా సినిమా, ప్రమోషన్స్ అన్ని తన కంట్రోల్ లో ఉండేలా అట్లీ డిమాండ్ చేశారట. మరీ ఈ స్థాయి డిమాండ్స్ భరించలేక నిర్మాతలు వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios