ఇప్పటికే, విడాకులు తీసుకున్న ఆ యంగ్ హీరోతో మీనా రెండో పెళ్ళికి రెడీ అయ్యారని ఓ తమిళ యూట్యూబ్ వీడియో చేస్తే అది వైరల్ అయ్యింది. ఆల్రెడీ నిశ్చితార్థం జరిగిందని కూడా అంటోంది.
ఒకప్పుడు తెలుగులో స్టార్ హీరోయిన్ గా ఏలిన నటి మీనా. ఆ తర్వాత వివాహం చేసుకుని నటనను ప్రక్కన పెట్టింది. మళ్లీ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారిన సంగతి తెలిసిందే. ఇటీవలె భర్త విద్యాసాగర్‌ను కోల్పోయిన మీనా ఆ బాధ నుంచి తేరుకోవడానికి వరుస షూటింగ్స్‌లో పాల్గొంటుంది. తెలుగు, తమిళం, మలయాళ భాషల్లో పలు సినిమాలకు ఆమె సైన్ చేసింది. ఇదిలా ఉండగా గత రెండు, మూడు రోజులుగా మీనా రెండో పెళ్లిపై సోషల్ మీడియాలో రకరకాల వార్తలు షికార్లు చేస్తున్నాయి.
తన కంటే వయసులో చిన్నవాడైన ఓ హీరో ని చేసుకోబోతోందని ఆ వార్తల సారాంశం. ఇప్పటికే, విడాకులు తీసుకున్న ఆ యంగ్ హీరోతో మీనా రెండో పెళ్ళికి రెడీ అయ్యారని ఓ తమిళ యూట్యూబ్ వీడియో చేస్తే అది వైరల్ అయ్యింది. ఆల్రెడీ నిశ్చితార్థం జరిగిందని కూడా అంటోంది. ఇటీవల తన భార్యకు విడాకులు ఇచ్చిన యువ తమిళ హీరో, మీనా పెళ్లి చేసుకోనున్నారని ఆ కథనం సారాంశం. ప్రస్తుతం చెన్నై సినిమా సర్కిళ్లలో క్రేజీ రూమర్ ఇది. నమ్మడానికి కొంచెం కష్టంగా ఉంది. కొందరైతే ఆ యూట్యూబర్ ని అమ్మనా బూతులు తిడుతూ కామెంట్స్ చేస్తున్నారు.
మరో ప్రక్క తల్లిదండ్రుల ఒత్తిడి, కూతురి భవిష్యత్తును దృష్టిని ఉంచుకొని మీనా రెండో పెళ్లికి ఒకే చెప్పిందంటూ వార్తలు వైరల్ అవతున్నాయి. ఈ విషయం మీనా చెవిన కూడా పడిందట. దీంతో ఇలాంటి రూమర్స్‌ని వైరల్ చేస్తున్నందుకు మీనా ఆగ్రహం వ్యక్తం చేసిందట. 'డబ్బు కోసం ఏమైనా రాస్తారా? సోషల్ మీడియా రోజు రోజుకు దిగజారిపోతుంది. వాస్తవాలు తెలుసుకుని రాయండి. నా భర్త చనిపోయినప్పుడు కూడా సోషల్ మీడియాలో రకరకాల తప్పుడు ప్రచారాలు చేశారు. తనపై అసత్య వార్తలు రాస్తే వాళ్లపై చర్యలు తీసుకుంటా' అంటూ గట్టిగా వార్నింగ్ ఇచ్చినట్లు సన్నిహిత వర్గాలు తెలిపాయి. ఇక మీనా రెండో పెళ్లిపై వస్తున్న వార్తలను ఆమె క్లోజ్‌ఫ్రెండ్ ఒకరు తీవ్రంగా ఖండించారు. ఇందులో ఎలాంటి వాస్తవం లేదని, ఒకవేళ పెళ్లి చేసుకునే ఉద్దేశం ఉంటే మీనానే స్వయంగా ప్రకటిస్తుందని రూమర్స్ సృష్టించొద్దు అంటూ క్లారిటీ ఇచ్చారు.
ఇప్పుడు సినిమాలపై మీనా పూర్తి దృష్టి పెట్టారు. ఆ మధ్య రాజేంద్ర ప్రసాద్ తో కలిసి ఉన్న ఒక ఫోటోను ఆ మధ్య పోస్ట్ చేశారు. ''సుమారు 32 ఏళ్ళ తర్వాత నా మొదటి హీరోతో కలిసి నటిస్తున్నా'' అని ఆమె పేర్కొన్నారు. 'బిగ్ బాస్' ఫేమ్ సొహైల్ హీరోగా నటిస్తున్న 'ఆర్గానిక్ మామ - హైబ్రిడ్ అల్లుడు'లో రాజేంద్ర ప్రసాద్, మీనా జంటగా కనిపించారు. ఈ సినిమా రెండు వారాల క్రితం విడుదల అయ్యింది. ఇప్పుడు మీనా చేతిలో కొన్ని సినిమాలు ఉన్నాయి. ఇంట్లో పెద్దలు మళ్ళీ పెళ్లి చేసుకోమని ఒత్తిడి చేస్తున్నా సరే... సున్నితంగా వాళ్ళ ప్రతిపాదనను మీనా పక్కన పెడుతున్నారని సమాచారం.
