‘పుష్ప’ ఫస్ట్ ఫార్ట్ క్లైమాక్స్ ఇదేనా?
ఈ చిత్రం రెండు పార్ట్ లుగా రెడీ అవుతోంది. ఈ నేపధ్యంలో ఫస్ట్ ఫార్ట్ ఎక్కడ ఆగుతుంది..క్లైమాక్స్ ఏమై ఉంటుందనే డిస్కషన్స్ ఫిల్మ్ సర్కిల్స్ లో షురూ అయ్యాయి.
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరో గా సుకుమార్ డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న చిత్రం ‘పుష్ప’. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమాలో బన్నీ మాస్ లుక్‌లో కనిపించనున్నారు. ‘ఆర్య’, ‘ఆర్య-2’ తర్వాత సుకుమార్-బన్నీ కాంబినేషన్‌లో రానున్న హ్యాట్రిక్ చిత్రం కావడంతో పుష్పపై ప్రేక్షకుల్లో ఎన్నో అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రం రెండు పార్ట్ లుగా రెడీ అవుతోంది. ఈ నేపధ్యంలో ఫస్ట్ ఫార్ట్ ఎక్కడ ఆగుతుంది..క్లైమాక్స్ ఏమై ఉంటుందనే డిస్కషన్స్ ఫిల్మ్ సర్కిల్స్ లో షురూ అయ్యాయి.
అందుతున్న సమాచారం మేరకు ... ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రంలో అల్లు అర్జున్ పుష్పరాజ్‌గా కనిపించనున్నారు. అతనో లారీ డ్రై వర్. ఫస్ట్ పార్ట్ పూర్తయ్యే సరికి..అతనో పెద్ద డాన్ గా రూపొందుతాడు. ఎర్రచందనం స్మగ్లింగ్ చేసే పుష్పరాజ్ కు లెక్కకు మించి శత్రువులు తయారవుతారు. అలాగే ఫస్ట్ పార్ట్ లోనే ఫహద్ ఫాజిల్ కనిపిస్తారు. ఎంట్రీ గ్రాండ్ గా ఉంటుంది. అయితే సెకండ్ పార్ట్ లో ఆయన కు ఫుల్ లెంగ్త్ రోల్ ఉంటుంది. అయితే ఇవన్నీ ఫిల్మ్ సర్కిల్స్ లో వినపడే కబుర్లే. నిజమెంత అనేది తెలియాల్సి ఉంది. ఇక ఈ సినిమాలో బన్నీ సరసన రష్మిక సందడి చేయనుంది. ఫహద్ ఫాజిల్ విలన్ పాత్రలో కనిపించనున్నాడు.
ఫహద్ తన పాత్ర గురించి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘దర్శకుడు సుకుమార్ చెప్పిన స్ర్కిప్టు నాకు చాలా బాగా నచ్చింది. ఈ భారీ యాక్షన్ చిత్రంలో భాగస్వామిని అయినందుకు ఆనందంగా ఉంది. ఇందులో నా పాత్ర విభిన్నంగా ఉండబోతుంది. నా కెరీర్‌లో ఇప్పటి వరకు ఇలాంటి విభిన్న పాత్ర పోషించలేదు’ అని తెలిపారు. ‘ఆర్య’, ‘ఆర్య 2’ తర్వాత బన్నితో సుకుమార్ తెరకెక్కిస్తోన్న సినిమా కావడంతో అంచనాలు భారీగా పెరుగుతున్నాయి.
‘డిస్కోరాజా’, ‘కలర్‌ఫొటో’తో తనలోని విలనిజం చూపించిన సునీల్ ‘పుష్ప’కి విలన్ అవుతాడని అంటున్నారు. అలాగే ‘పుష్ప’లో తొమ్మిది మంది విలన్లు ఉంటారని అంటున్నారు. సౌండ్ డిజైనర్‌గా ఆస్కార్ విజేత పూకుట్టిని తీసుకున్నట్టు ప్రకటించింది చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్. పాన్ ఇండియా చిత్రంగా తెరకెక్కుతున్న ఈ చిత్రం తెలుగుతో పాటు హిందీ, తమిళ, మలయాళ భాషల్లో ఆగస్టు 13న ప్రేక్షకుల ముందుకు రానుంది.