ఈ మధ్య కాలంలో బాగా వైరల్ అయిన పెళ్లి మ్యాటర్ ఎవరిదంటే ఠక్కున సింగర్ సునీత పేరే గుర్తుకువస్తుంది. ఆమె మళ్లీ పెళ్లిచేసుకోబోతందంటూ చాలా కాలం పుకార్లు షికార్లు చేశాయి. చివరికి ఆమె తన పెళ్లి గురించి అన్ని రకాల పుకార్లకు ఫుల్ స్టాప్ పెట్టన సంగతి తెలిసిందే. తను జీవితంలో సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెడుతున్నానని సునీత మొన్న ప్రకటించింది. 

అయితే ఆమె నిశ్చితార్ధం చేసుకున్నట్టు ప్రకటించి, తామిద్దరి ఫొటోలు, నిశ్చితార్థం వీడియో షేర్ చేసింది. కానీ పెళ్లి గురించి మాత్రం ఎలాంటి ప్రకటనా చేయలేదు. దీంతో ఇప్పుడు సునీత పెళ్లి తేదీమీద పుకార్లు ప్రచారమవుతున్నాయి. ఒక్కొక్కరూ ఒక్కో విధమైన తేదీలతో ప్రచారం చేస్తున్నారు. 

అయితే విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు పెళ్లి తేదీ ఇంకా ఫిక్స్ కాలేదని అంటున్నారు. ఇద్దరి జాతకాలు చూసి మంచి రోజున పెళ్లి తేదీ ఫిక్స్ చేస్తారని అంటున్నారు. సో ప్రస్తుతానికి అయితే ఇంకా పెళ్లి తేదీ ఫిక్స్ కాలేదన్న మాట. ఇక ఈ విషయం మీద సునీత లేదా ఆమెకు కాబోయే భర్త నుండి అఫీషియల్ కన్ఫర్మేషన్ వస్తే కానీ పెళ్లి ఏ రోజున ఉంటుందనేది చెప్పలేం. 

ఇక సునీత టాలీవుడ్ లో లీడ్ సింగర్స్ లో ఒకరిగా కొనసాగుతోండగా ఆమె భర్త తెలుగులో డిజిటల్ మీడియా కంపెనీలను నిర్వహిస్తున్నారు. తెలుగు మీడియా, డిజిటల్ మీడియా రంగాల్లో ఆయన అందరికీ సుపరిచితమే.