Asianet News TeluguAsianet News Telugu

రామ్‌చరణ్‌ని ఇంతగా టార్గెట్‌ చేశారంటే?

కొరటాల శివతో రామ్‌చరణ్‌ సినిమా చేయబోతున్నాడని, `ఆర్‌ ఆర్‌ ఆర్‌` తర్వాత అదే ఉండే ఛాన్స్ ఉందని అన్నారు. కానీ ఇటీవల అల్లు అర్జున్‌తో నెక్ట్స్ సినిమా చేయబోతున్నట్టు కొరటాల ప్రకటించారు. దీంతో కొత్త డైరెక్టర్స్ పేర్లు తెరపైకి వస్తున్నాయి. వంశీపైడిపల్లితోనూ సినిమా ఉంటుందని చాలా రోజులుగా వినిపిస్తుంది. 

rumors about a new movie starring ram charan
Author
Hyderabad, First Published Aug 5, 2020, 9:41 AM IST

మెగాపవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌పై కొత్త సినిమాలకు సంబంధించి రూమర్స్ వెల్లువెత్తుతున్నాయి. బ్యాక్‌ టూ బ్యాక్‌ దాదాపు అరడజను దర్శకులు ఆయన జాబితాలో ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. రోజుకో కొత్త దర్శకుడి పేరు తెరపైకి వస్తుంది. ఆయన కాదు ఈయన.. ఈయన కాదు ఆయన అంటున్నారు. గాసిప్ రాయుళ్ళు కొత్త కొత్త రూమర్స్ క్రియేట్‌ చేస్తున్నారు. దీంతో రామ్‌ చరణ్‌ చేయబోయే అసలు దర్శకుడెవరూ? గాసిప్‌ దర్శకుడెవరో అర్థం కావడం లేదు. 

మొదట కొరటాల శివతో రామ్‌చరణ్‌ సినిమా చేయబోతున్నాడని, `ఆర్‌ ఆర్‌ ఆర్‌` తర్వాత అదే ఉండే ఛాన్స్ ఉందని అన్నారు. కానీ ఇటీవల అల్లు అర్జున్‌తో నెక్ట్స్ సినిమా చేయబోతున్నట్టు కొరటాల ప్రకటించారు. దీంతో కొత్త డైరెక్టర్స్ పేర్లు తెరపైకి వస్తున్నాయి. వంశీపైడిపల్లితోనూ సినిమా ఉంటుందని చాలా రోజులుగా వినిపిస్తుంది. అలాగే సురేందర్‌రెడ్డికి కూడా ఛాన్స్ ఇచ్చారని అన్నారు. దీంతోపాటు `భీష్మ` సినిమాతో హిట్‌ అందుకున్న వెంకీ కుడుములతోనూ ఇటీవల చర్చలు జరిగాయనే టాక్‌ ఫిల్మ్ నగర్‌లో చక్కర్లు కొట్టింది. 

ఈ ముగ్గురు కాకుండా మరో ముగ్గురు కొత్త దర్శకుల పేర్లు వినిపిస్తున్నాయి. వారిలో ఒకరు `అర్జున్‌రెడ్డి`, `కబీర్‌ సింగ్‌` ఫేమ్‌ సందీప్‌రెడ్డి వంగా. మరి దీని అప్‌డేట్‌ ఏంటో ఇంకా తెలియదు. తాజాగా మైత్రీమూవీ మేకర్స్ రామ్‌చరణ్‌ని ఓ ప్రాజెక్ట్ కి బుక్‌ చేసుకున్నట్టు తెలిసింది. `ఖైదీ`తో సూపర్‌ హిట్‌ అందుకున్న తమిళ దర్శకుడు లోకేష్‌ కనగరాజ్‌ డైరెక్షన్‌లో తమ బ్యానర్‌లో ఓ సినిమా చేయబోతున్నారని, ఇందులో రామ్‌చరణ్‌ హీరో అని అంటున్నారు. లోకేష్‌ ప్రస్తుతం విజయ్‌ హీరోగా `మాస్టర్‌` చిత్రాన్ని రూపొందించారు. ఇది విడుదలకు సిద్ధంగా ఉంది. 

చెర్రీ ఖాతాలో ఉన్న మరో డైరెక్టర్‌ వేణుశ్రీరామ్‌. ఇటీవల బన్నీ హ్యాండివ్వడంతో `ఐకాన్‌` సినిమా పక్కకు వెళ్లిన విషయం తెలిసిందే. వేణు శ్రీరామ్‌ దర్శకత్వం వహించనున్న ఈ సినిమాని చెర్రీతోగానీ, నానితోగానీ చేయాలనుకుంటున్నారట నిర్మాత దిల్‌రాజు. మరి ఈ ఇద్దరిలో ఎవరితో ఫిక్స్ అవుతాడో చూడాలి. ఇలా చరణ్‌కి సంబంధించిన వార్తలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ అవుతూ ఫ్యాన్స్ ని, నెటిజన్లని కన్‌ ఫ్యూజ్‌ చేస్తున్నాయి. 

ఇక ప్రస్తుతం చరణ్‌ `ఆర్‌ఆర్‌ఆర్‌`తోపాటు కొరటాల శివ దర్శకత్వంలో చిరంజీవి హీరోగా రూపొందే `ఆచార్య`లో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ నెల 22న మెగాస్టార్‌ బర్త్ డే సందర్భంగా ఈ చిత్ర ఫస్ట్‌లుక్‌, టీజర్‌ విడుదలకు సన్నాహాలు జరుగుతున్నాయి. దీంతోపాటు చిరు నెక్ట్స్ సినిమా అనౌన్స్ మెంట్‌ కూడా ఉంటుందని టాక్‌. చరణ్‌ నెక్ట్స్ ప్రాజెక్ట్ అనౌన్స్ మెంట్‌ సైతం ఉంటుందనే వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఇందులో నిజమెంతా అనేది వేచి చూడాలి. 

Follow Us:
Download App:
  • android
  • ios