కిరణ్ అబ్బవరం, నేహా శెట్టి జంటగా నటిస్తున్న రూల్స్ రంజన్ చిత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ చిత్రం నుంచి రిలీజ్ చేసిన సమ్మోహనుడా అనే సాంగ్ వల్లే ఈ రేంజ్ లో పబ్లిసిటీ దక్కుతోంది.
కిరణ్ అబ్బవరం, నేహా శెట్టి జంటగా నటిస్తున్న రూల్స్ రంజన్ చిత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ చిత్రం నుంచి రిలీజ్ చేసిన సమ్మోహనుడా అనే సాంగ్ వల్లే ఈ రేంజ్ లో పబ్లిసిటీ దక్కుతోంది. నేహా శెట్టి అందాలు ఆరబోస్తూ మతిపోగోట్టే డ్యాన్స్ తో ఈ సాంగ్ ఓ కవ్విస్తోంది.
సెప్టెంబర్ 28న ఈ చిత్రం రిలీజ్ కి సిద్ధం అవుతోంది. దీనితో చిత్ర యూనిట్ తాజాగా రూల్స్ రంజన్ త్రిల్లర్ రిలీజ్ చేశారు. ట్రైలర్ మొత్తం కామెడీ పంచ్ లు..గర్ల్ ఫ్రెండ్స్ తో అల్లరితో నిండిపోయింది. కిరణ్ అబ్బవరం ఈ చిత్రంలో కామెడీ, రొమాన్స్ కే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు.
హీరోయిన్ నేహా శెట్టి రొమాంటిక్ గా నటించింది. ఈ చిత్రంలో నేహా శెట్టి, కిరణ్ అబ్బవరం కెమిస్ట్రీ అదిరిపోయినట్లు ఉంది. ఇక వెన్నెల కిషోర్, హైపర్ ఆది, వైవా హర్ష, సుదర్శన్ చేస్తున్న అల్లరి అంతా ఇంతా కాదు. వెన్నెల కిషోర్ అయితే డానియల్ వెబర్ మీద ఒట్టు, అతడే నా ఇన్సిపిరేషన్ అంటూ సన్నీలియోన్ భర్త గురించి చెబుతున్న డైలాగ్స్ చాలా ఫన్నీగా ఉన్నాయి.

ముంబై నేపథ్యంలో సాగే రొమాంటిక్ కామెడీ లవ్ డ్రామాగా ఈ చిత్రం ఉండబోతోంది. నేహా శెట్టి, కిరణ్ అబ్బవరం ఇద్దరూ మంచి కామెడీ టైమింగ్ పండిస్తున్నారు. ట్రైలర్ చూస్తుంటే మినిమమ్ ఫన్ గ్యారెంటీ అని అర్థం అవుతోంది. రత్నం కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి అమ్రిష్ సంగీతం అందిస్తున్నారు.
