Asianet News TeluguAsianet News Telugu

RT4GM : రవితేజ - గోపీచంద్ మాలినేని సినిమా.. ఇంట్రెస్టింగ్ కాస్ట్ అండ్ క్రూ.. ఫుల్ డిటేయిల్స్

మాస్ మహారాజా రవితేజ - గోపీచంద్ మాలినేని కాంబోలో నాలుగో సినిమాను ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ సినిమా కోసం పనిచేస్తున్న టెక్నీషియన్లు, నటీనటుల వివరాలను యూనిట్ ప్రకటించింది. ప్రముఖ దర్శకుడు తొలిసారిగా తెలుగులో నటుడిగా అలరించబోతున్నారు. 
 

RT4GM movie Actors and technicians Details NSK
Author
First Published Oct 26, 2023, 9:14 AM IST | Last Updated Oct 26, 2023, 9:14 AM IST

మాస్ మహారాజా, టాలీవుడ్ సీనియర్ హీరో రవితేజ (Ravi Teja)  వరుస చిత్రాలతో అదరగొడుతున్నారు. దసరాకు ‘టైగర్ నాగేశ్వరరావు’తో వచ్చి మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకున్నారు. ఇక ప్రస్తుతం తన నెక్ట్స్ ప్రాజెక్ట్ పై ఫోకస్ పెట్టారు. మాస్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని (Gopichand Malineni) తో నాలుగోసారి సినిమాను ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ మూవీ పట్టాలెక్కేందుకు సిద్ధంగా ఉంది. ఇప్పటికే గోపీ - రవితేజ కాంబోలో మూడు సినిమాలు ‘డాన్ శ్రీను’, ‘బలుపు’, ‘క్రాక్’ చిత్రాలు వచ్చి సక్సెస్ ను అందుకున్న విషయం తెలిసిందే. 

నాలుగోసారి ఈ మోస్ట్ సక్సెస్ ఫుల్ కాంబినేషన్ రిపీట్ అవ్వడంతో RT4GM పై అంచనాలు భారీ స్థాయిలో ఉన్నాయి. అయితే, ఈ ప్రాజెక్ట్ కు సంబంధించిన ఇంట్రెస్టింగ్ డిటేయిల్స్ ను మేకర్స్ అనౌన్స్ చేశారు. చిత్రంలో పనిచేస్తున్న టెక్నీషియన్లు, నటీనటులను, ఇతర టీమ్ ను పరిచయం చేశారు. నటీనటుల విషయానికొస్తే.. ప్రముఖ తమిళ దర్శకుడు సెల్వారాఘవన్ (Selvaraghavan)ను ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇప్పటికే ఈయన బీస్ట్, ఫర్హానా, మార్క్ ఆంటోనీ వంటి చిత్రాలతో అలరించారు. విభిన్న పాత్రలతో అదరగొడుతున్న దర్శకుడు.. ఇప్పుడు తెలుగులో తొలిసినిమా చేస్తున్నారు. నటుడిగా ఆడియెన్స్ ను అలరించబోతున్నారు. ‘7/జీ బృందావనం కాలనీ’, ‘ఆడవారి మాటలకు అర్థాలే వేరులే’ వంటి చిత్రాలకు ఈయన దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే. 

ఈ చిత్రంతో మరో టాలెంటెడ్ అండ్ యంగ్ బ్యూటీ ఇందూజ రవిచంద్రన్ (Indhuja Ravichandran)  టాలీవుడ్ కు ఎంట్రీ ఇస్తోంది. విజయ్ ‘బిజిల్’, ధనుష్ ‘నేనే వస్తున్నా’ వంటి చిత్రాల్లో నటించిన ఈమె రవితేజ - గోపీచంద్ సినిమాలో కీలక పాత్ర పోషిస్తోందని మేకర్స్ ప్రకటించారు. హీరోయిన్ ఎవరనేది ప్రకటించలేదు. మోస్ట్లీ రష్మిక మందన్న అంటున్నారు. దీనిపై అధికారిక ప్రకటన లేదు. ఇక టెక్నీషియన్స్ విషయానికొస్తే.. జీకే విష్ణు - సినిమాటోగ్రఫీ, నవీన్ నూలి - ఎడిటర్, థమన్ - సంగీతం అందిస్తున్నారు. సాయి మాధవ్ బుర్ర డైలాగ్ రైటర్. AS Prakash - ప్రొడక్షన్ డిజైనర్ గా వ్యవహరిస్తున్నారు. 

భారీ బడ్జెట్ చిత్రాలను నిర్మిస్తూ వస్తున్న మైత్రీ మూవీ మేకర్స్  బ్యానర్ పై ఈ మూవీ రూపుదిద్దుకుంటోంది. ఓ రియల్ ఇన్సిడెంట్ ద్వారా సినిమాను తెరకెక్కించబోతున్నారని టాక్. నవీన్ యెర్నెనీ, వై రవి శంకర్ నిర్మిస్తున్నారు. ఇక రవితేజ ‘ఈగల్’ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios