RRR Promotions: ట్రిపుల్ ఆర్ కు కొత్త పేరు పెట్టిన కపిల్ శర్మ.. రాజమౌళి ఏమన్నాడంటే..?

కపిల్ శర్మ షోలో సందడి చేశారు ట్రిపుల్ ఆర్ టీమ్. సరదా పంచులు.. ట్రిపుల్ ఆర్ సెలెబ్రిటీల పర్సనల్ ముచ్చట్లతో హడావిడి చేశారు. ఈ సందర్భంగా ట్రిపుల్ ఆర్ కు కొత్త మీనింగ్ చెప్పారు కపిల్ శర్మ.

RRR Team Promotions At Kapil Sharma Show

ట్రిపుల్ ఆర్ రిలీజ్ కు ఇంకా వారం రోజులు మాత్రమే ఉంది. ప్రమోషన్స్ తో హడావిడి చేస్తున్నారు జక్కన్న టీమ్. అన్ని భాషల్లో స్పెషల్ ఈవెంట్స్ తో.. దడదడలాడిస్తున్నారు. భారీ కలెక్షన్స్ లక్ష్యంగా ట్రిపుల్ ఆర్ టీమ్ పక్కా స్కెచ్ తో ప్రమోషన్స్ చేస్తున్నారు. ఏ స్టేట్ వెళ్లినా.. ఎన్టీఆర్, చరణ్ తో పాటు రాజమౌళికి భారీగా ఫ్యాన్స్ వెల్కం చెపుతున్నారు. దీంతో ట్రిపుల్ ఆర్ పై ఎంత భారీ అంచాలు ఉన్నయో అర్ధం అవుతుంది. ఆ అంచనాలు ఇంకా పెంచుతూ.. రాజమౌళి ఎప్పటి కప్పుడు సినిమాను ప్రమోట్ చేస్తూనే ఉన్నాడు.

 

ఇక రీసెంట్ గా ట్రిపుల్ ఆర్ ప్రమోషన్స్ లో భాగంగా బాలీవుడ్ స్టార్ కమెడియన్  కపిల్ శర్మ హోస్ట్ గా నడుస్తున్న “ది కపిల్ శర్మ షో” కి వెళ్లారు ట్రిపుల్ ఆర్ టీమ్. రాజమౌళితో పాటు రామ్ చరణ్, ఎన్టీఆర్, ఆలియా భట్ ఈ షో లో సందడి చేశారు. ఇక ట్రిపుల్ ఆ టీమ్ ను తన మాటలు, ప్రశ్నలతో కడుపుబ్బా నవ్వించాడు కపిల్ శర్మ.అడిగే ప్రశ్నలు కూడా ట్రిపుల్ ఆర్ టీమ్ తో పాటు ఆడియన్స్ కు కితకితలు పెట్టించాయి.అంతే కాదు ఈ షోలో ట్రిపుల్ ఆర్ టైటిల్ కు కొత్త అర్ధం తీశాడు కపిల్.

 

టీమ్ తో సరదాగా చిట్ చాట్ చేసిన కపిల్ శర్మ.. ఆర్ఆర్ఆర్ అంటే రూపాయి రూపాయి రూపాయి అంటూ రాజమౌళిని ఆటపట్టించాడు.రాజమౌళి కూడా ఈ కామెంట్ ను సరదాగా నవ్వుతూ..ఎంజాయ్ చేశాడు. అటు రామ్ చరణ్ తో మాట్లాడుతూ... మీకు చాలా బిజినెస్ లు ఉన్నాయి కదా..? అయినా సినిమాలు ఇంత ఇష్టంగా చేస్తున్నారెందకు అన్నారు. దానికి చరణ్ సమాధానం చెపుతూ.. బిజినెస్ లు చూసుకుంటూ ఉంటే.. కపిల్ షోకి వచ్చేవాడిని కాదు కదా అంటూ.. కపిల్ కు పంచ్ వేశారు.

అంతే కాదు మీ నాన్న చిరంజీవి, బాబాయి పవన్ స్టార్లు.. మీ ఇంట్లో చాలా మంది స్టార్స్ ఉన్నారు. అందరూ కూర్చుని భోజనం చేస్తున్నప్పుడు, వాచ్ మెన్ వచ్చి ఓ అభిమాని వచ్చాడు అని చెపితే.. ఎవరి అభిమాని అని మీరు కన్ ఫ్యూజ్ అవుతారా..? అని ఫన్నీ గా అడిగారు కపిల్. దానికి రామ్ చరణ్ కూడా తెలివిగా సమాధానం చెప్పారు. కచ్చితంగా కన్ ఫ్యూజ్ అవుతాము. ఫ్యాన్స్ మాత్రమే కాదు కథ చెప్పడానికి డైరెక్టర్ ఎవరైనా వచ్చినా... అదే కన్ ఫ్యూజన్ ఉంటుంది అంటూ చమత్కరించారు చరణ్.

 

అటు ఆలియా, తారక్ లను కూడా ఫన్నీ క్వశ్చన్స్ తో ఆటపట్టించాడు కపిల్. ఆలియాతో మాట్లాడుతూ.. ట్రిపుల్ ఆర్ కథ విని ఓకే చేశారా..? లేక ఆర్(రణ్ భీర్) లెటర్ ఉంది అని సినిమా ఫిక్స్ అయ్యారా అంటూ… ఆటపట్టించాడు కపిల్ శర్మ. కపిల్ అడగ్గానే సిగ్గుతో తనలో తాను నవ్వుకుంది ఆలియ. రాజమౌళి హిందీ గురించి.. తన ఇగ్లీష్ గురించి పంచులు వేసకున్న కపిల్ శర్మ.. చరణ్ తో సినిమా చేయడం గురించి ఎన్టీఆర్ ను ఫన్నీక్వశ్చన్స్ తో కన్వ్యూజ్ చేశాడు.

దాదాపు 500 కోట్ల బడ్జెట్ తో.. పాన్ ఇండియా రేంజ్ తో తెరకెక్కింది ట్రిపుల్ ఆర్ సినిమా. రాజమౌళి డైరెక్షన్ లో రామ్ చరణ్ సీతారామ రాజుగా.. ఎన్టీఆర్ కొమురం  భీమ్ గా .. ఆలియా భాట్ సీతగా నటిస్తుంది. బాలీవుడ్ స్టార్ అజయ్ దేవగణ్ , శ్రీయ ప్రత్యేక పాత్రల్లో నటించారు. కీరవాణి మ్యూజిక్ అందించిన ఈ మూవీ ప్రమోషనల్ వీడియోస్ కు భారీ స్థాయిలో రెస్పాన్స్ వస్తోంది.  ప్రపంచ వ్యాప్తంగా ట్రిపుల్ ఆర్ మూవీ జనవరి 7న రిలీజ్ కాబోతోంది.

Also Read : Naga Chaitanya: నాగచైతన్య ఎలాంటివాడంటే..? వైరల్ అవుతున్న పోస్ట్.

 

 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios