Asianet News TeluguAsianet News Telugu

వాచ్ మెన్ ని మూడో అంతస్తు నుంచి తోసేసిన ఆర్ఆర్ఆర్ డ్యాన్సర్..అరెస్ట్, అసలేం జరిగిందంటే..

దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ ఇండియన్ సినిమాలోనే ఒక మెమొరబుల్ మూవీగా నిలిచింది. ఆస్కార్ సాధించింది. ఈ చిత్రంలో ఎండ్ కార్డ్స్ లో ఎత్తర జెండా అనే సాంగ్ ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటుంది.

RRR Said dancer throws watch man from third floor dtr
Author
First Published Apr 28, 2023, 3:16 PM IST

దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ ఇండియన్ సినిమాలోనే ఒక మెమొరబుల్ మూవీగా నిలిచింది. ఆస్కార్ సాధించింది. ఈ చిత్రంలో ఎండ్ కార్డ్స్ లో ఎత్తర జెండా అనే సాంగ్ ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటుంది. ఈ సాంగ్ లో భరతమాత ముద్దుబిడ్డలు, స్వాతంత్ర యోధుల గురించి చూపిస్తారు. చాలా హుషారుగా వినసొంపుగా ఈ సాంగ్ ఉంటుంది. 

ఈ పాటలో ఎన్టీఆర్, రాంచరణ్, అలియా భట్, ఒలీవియా, అజయ్ దేవగన్ తో పాటు రాజమౌళి కూడా కనిపిస్తారు. ఈ సాంగ్ లో మణికంఠన్ అనే వ్యక్తి సైడ్ డ్యాన్సర్ గా చేశాడు. ఇప్పుడు ఆ మణికంఠన్ మద్యం మత్తులో నేరం చేసి అరెస్ట్ అయ్యాడు. వాచ్ మెన్ ని మూడో అంతస్తు నుంచి తోసేసిన ఘటనలో బంజారా హిల్స్ పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. 

వివరాల్లోకి వెళితే.. బంజారాహిల్స్ రాఘవ రెసిడెన్సీలో మణికంఠన్ తన తోటి డ్యాన్సర్లతో కలసి ఉంటున్నాడు. రీసెంట్ గా మణికంఠన్ అతడి స్నేహితులు మద్యం సేవించి కారిడార్ లో గోలచేయడం ప్రారంభించారు. దీనితో వాచ్ మెన్ కారిడార్ లో గొడవ చేయద్దు అంటూ మణికంఠన్ కి సూచించారు. 

మద్యం మత్తులో ఆగ్రహానికి గురైన మణికంఠన్ వాచ్ మెన్ యాదగిరితో గొడవకి దిగాడు. వివాదం ఎక్కువ కావడంతో యాదగిరిని మూడో అంతస్తు నుంచి తోసేశాడు. దీనితో వాచ్ మెన్ కి తీవ్రంగా గాయాలయ్యాయి. అపార్ట్మెంట్ వ్యక్తులు యాదగిరిని ఆసుపత్రికి తరలించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీనితో రంగంలోకి దిగిన పోలీసులు మణికంఠన్ ని అదుపులోకి తీసుకున్నారు. 

వాస్తవానికి మణికంఠన్ తమిళ చిత్ర పరిశ్రమకి చెందిన వ్యక్తి. టాలీవుడ్ లో అవకాశాల కోసం హైదరాబాద్ వచ్చి స్థిరపడ్డట్లు తెలుస్తోంది. ప్రస్తుతం యాదగిరి ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది.. పోలీసులు మణికంఠన్ స్నేహితులని కూడా విచారిస్తున్నారా అనే విషయాలు తెలియాల్సి ఉంది. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios