ఏం ఐడియా సామి..రాజమౌళిని మెచ్చుకోకుండా ఉండలేం

ఈ క్రమంలో ఆమె తెలుగు డైలాగులు ప్రాక్టీస్ చేస్తోంది.అయితే రాజమౌళి తెలుగు లైన్స్ ఆమె స్పష్టంగా పలికేందుకుగాను ఓ వాయిస్ కోచ్ ని ప్రొవైడ్ చేసారని తెలుస్తోంది. ఆమె డైలాగులు చెప్పేటప్పుడు లిప్ సింక్ సరిగ్గా లేకపోతే తెలుగులో ఇబ్బంది ఎదురౌతుందని ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్తున్నారు. రాజమౌళి కేవలం అలియాకు మాత్రమే కాకుండా ఒలివియా మోరిస్  కూడా అదే పని చేసారు. ప్రస్తుతం ఆర్ ఆర్ ఆర్ షూట్ హైదరాబాద్ లో జరుగుతోంది. పిబ్రవరి 2021 దాకా కంటిన్యూ షెడ్యూల్ జరగనుందని సమాచారం.
 

RRR  Rajamouli provide Voice coach for Alia Bhatt! jsp

రాజమౌళి ఎంతో ప్రతిష్ఠాత్మకంగా ఎన్టీఆర్, రామ్ చరణ్ వంటి అగ్ర హీరోలతో తెరకెక్కిస్తోన్న చిత్రం ఆర్ ఆర్ ఆర్( ‘రౌద్రం రణం రుధిరం’). ఈ సినిమాకు బాలీవుడ్‌ మార్కెట్ కోసం ఆలియా భట్‌ను హీరోయిన్‌గా ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. ఆర్ఆర్ఆర్‌లో ఎన్టీఆర్‌కు జోడిగా ఇంగ్లీష్ నటి ఒలివియా మోరిస్ నటిస్తుంటే, చరణ్‌కు జోడిగా హిందీ నటి ఆలియా భట్ నటించనుంది. దాదాపు 60 శాతం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా.. తన తర్వాత షెడ్యూల్‌ను పూణేలో నిర్ణయించింది. అయితే కారోనా కారణంగా ఆ షెడ్యూల్ వాయిదా పడింది.  ఈ క్రమంలో ఆలియా భట్.. ఇంతవరకు ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ లో పాల్గొనలేదు. 

అయితే ఈ పూణే షెడ్యూల్‌లో ఆలియా ఆర్ ఆర్ ఆర్ టీమ్‌తో జాయిన్ కానుంది.  వచ్చే నెల నుంచి అలియా ఈ షూట్ లో జాయిన్ అవుతుంది. ఆమె డేట్స్ టైట్ గా ఉండటంతో రాజమౌళి డిసెంబర్ నుంచి షూటింగ్ ప్రారంభించి ముందుగా ఆలియా భట్ కాంబినేషన్‌లో వున్న సన్నివేశాలను ఈ షెడ్యూల్లోనే పూర్తి చేస్తాడట. ఈ క్రమంలో ఆమె తెలుగు డైలాగులు ప్రాక్టీస్ చేస్తోంది.అయితే రాజమౌళి తెలుగు లైన్స్ ఆమె స్పష్టంగా పలికేందుకుగాను ఓ వాయిస్ కోచ్ ని ప్రొవైడ్ చేసారని తెలుస్తోంది. ఆమె డైలాగులు చెప్పేటప్పుడు లిప్ సింక్ సరిగ్గా లేకపోతే తెలుగులో ఇబ్బంది ఎదురౌతుందని ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్తున్నారు. రాజమౌళి కేవలం అలియాకు మాత్రమే కాకుండా ఒలివియా మోరిస్  కూడా అదే పని చేసారు. ప్రస్తుతం ఆర్ ఆర్ ఆర్ షూట్ హైదరాబాద్ లో జరుగుతోంది. పిబ్రవరి 2021 దాకా కంటిన్యూ షెడ్యూల్ జరగనుందని సమాచారం.

ఇక  'ఆర్.ఆర్.ఆర్' లో అలియా భట్ సీత పాత్రలో కనిపించనుందని తెలుస్తోంది. ఈ క్రమంలో అలియాను గ్లామర్ యాంగిల్ లో చూపించడానికి రాజమౌళి ప్లాన్ చేసుకుంటున్నాడట. 'బాహుబలి' సినిమాలో మిల్కీ బ్యూటీ తమన్నా ను ఏ విధంగా అయితే రొమాంటిక్ యాంగిల్ లో చూపించాడో ఇక్కడ 'ఆర్.ఆర్.ఆర్'లో అలియా ను కూడా అలానే ప్రెజెంట్ చేయబోతున్నాడట. ఆలియా భట్ - రామ్ చరణ్ లపై ఓ సాంగ్ కూడా ఉంటుందట. ఈ సాంగ్ ను హిందీ వర్షన్ ఆలియా భట్ స్వయంగా ఆలపించనున్నారని వార్తలు వస్తున్నాయి. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios