ఒక తెలుగు పాటకు అంతర్జాతీయ స్థాయిలో ఇంత గుర్తింపు దక్కడమే కాకుండా ఏకంగా ఆస్కార్స్ గెలవడం అనేది నిజంగా ప్రతీ తెలుగు వాడికి గర్వకారణమైన విషయం.


భారతీయుల అందరి ఎదురుచూపులు ఫలించాయి. ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ఆర్ ఆర్ ఆర్ లోని నాటు నాటు పాట ఆస్కార్స్ కి నామినేట్ అయింది. ఇప్పుడు ఆ సాంగ్ ఆస్కార్స్ ను గెలుచుకుంది. సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి, రచయిత చంద్రబోస్ ఈ అవార్డును అందుకున్నారు. ఎంఎం కీరవాణి అవార్డు అందుకున్నాక తన స్పీచ్ ను సరదాగా ఇంగ్లీష్ లో చెప్పాడు. ఇక చంద్రబోస్ కేవలం నమస్తే అని చెప్పాడు. ఒక తెలుగు పాటకు అంతర్జాతీయ స్థాయిలో ఇంత గుర్తింపు దక్కడమే కాకుండా ఏకంగా ఆస్కార్స్ గెలవడం అనేది నిజంగా ప్రతీ తెలుగు వాడికి గర్వకారణమైన విషయం.

అంతకంటే ముందు నాటు నాటు సాంగ్ ను లైవ్ లో పెర్ఫర్మ్ చేస్తే దానికి స్టాండింగ్ అప్లాజ్ రావడం విశేషం. నిజంగా మన తెలుగు నాటు, అంతర్జాతీయంగా సత్తా చూపడం అభినందనీయం. ఈ సమయంలో ఆహా వారు సైతం ఈ నేపధ్యంలో ఓ చిన్న వీడియో రిలీజ్ చేసారు. 'ఆహా' ఓటీటీలో బాలయ్య వ్యాఖ్యాతగా 'అన్ స్టాపబుల్ ' టాక్ షో సూపర్ హిట్ గా కొనసాగుతోంది. ఈ కార్యక్రమంలో కీరవాణి, రాజమౌళి పాల్గొన్నUnstoppableS1 లో ఎపిసోడ్ లోది ఇది. ఆర్.ఆర్.ఆర్ సాంగ్ కు ఆస్కార్ వచ్చిన వేళ ఎపిసోడ్ ని గుర్తు చేస్తూ మన ముందుకు వచ్చారు. మీరూ చూసేయండి.

ఇక ‘ఆర్ఆర్ఆర్’ కోసం 19 నెలలు కష్టపడిన చంద్రబోస్ 20 పాటలు రాసి రాజమౌళి చేతికి ఇచ్చారు. అందులో నుంచి ఆయన ‘నాటు నాటు’ను ఎంచుకున్నారు. నాలుగున్నర నిమిషాల ‘నాటు నాటు’ పాట చిత్రీకరణకు దాదాపుగా 20 రోజులు పట్టింది. దీనికి 43 రీటేక్​లు అవసరం అయ్యాయి. ఇద్దరు మిత్రుల మధ్య వచ్చే ఈ పాట సినిమాకే హైలైట్ అవుతుందని చిత్ర యూనిట్ ముందునుంచీ నమ్మింది. పాటలో రామ్ చరణ్​, జూనియర్ ఎన్టీఆర్ తమ డ్యాన్స్​తో అందర్నీ ఉర్రూతలూగించారు. నృత్యం చేసిన చెర్రీ, తారక్​ గురించి అందరికీ తెలిసిందే.