ఎన్టీఆర్‌ అభిమానులను సర్‌ప్రైజ్‌ చేయబోతుంది `ఆర్‌ఆర్‌ఆర్‌` టీమ్‌. ఈ చిత్రాన్ని తారక్‌ బర్త్ డే సందర్భంగా ఓటీటీలో విడుదల చేయబోతుంది.

`ఆర్‌ఆర్‌ఆర్‌` (RRR) సినిమా ఎంతటి సంచలనాలు సృష్టించిందో తెలిసిందే. సుమారు రూ.12వందల కోట్ల గ్రాస్‌ వసూలు చేసినట్టు ట్రేడ్‌ వర్గాల అంచనా. అయితే సినిమాకి కాస్త నెగిటివ్‌ టాక్‌ ఉన్న కలెక్షన్లు మాత్రం దుమ్మురేపుతున్నాయి. ఎన్టీఆర్‌(NTR), రామ్‌చరణ్‌(Ram Charan)ల నట విశ్వరూపం హైలైట్‌గా నిలుస్తుంది. దర్శకధీరుడు రాజమౌళి(Rajamouli) నుంచి వచ్చిన మరో కళాఖండం `ఆర్‌ఆర్‌ఆర్‌` ఇప్పుడు ఓటీటీలో వచ్చే డేట్‌ ఫిక్స్ అయ్యింది. RRR OTT Date Final.

`ఆర్‌ఆర్‌ఆర్‌` సినిమా మార్చి 25న విడుదలైన విషయం తెలిసిందే. దాదాపు రెండు నెలల్లోనే ఈ చిత్రం ఓటీటీలో రాబోతుంది. మే 20న ఈ చిత్రాన్ని అన్ని భాషల్లో స్ట్రీమింగ్‌ చేయనున్నారు. తెలుగు, తమిళం, కన్నడలో రెండు నెలల్లోనే విడుదల చేయబోతున్నారట. అయితే ఎన్టీఆర్‌ కి బర్త్ డే సందర్భంగా ఇది స్ట్రీమింగ్‌ కాబోతుండటం విశేషం. మే 20న తారక్‌ బర్త్ డే. ఈ సందర్భంగా ఆయన అభిమానులకు ఓ గిఫ్ట్ ఇచ్చినట్టుగా ఉంటుందని భావించిందట యూనిట్‌. మొత్తంగా ఎన్టీఆర్‌ ఫ్యాన్స్‌ పెద్ద ట్రీట్‌ ఇవ్వబోతున్నారని చెప్పొచ్చు.

 తెలుగు, తమిళం, కన్నడలో ఇది జీ5లో స్ట్రీమింగ్‌ కానుంది. హిందీ వెర్షన్‌ నెట్‌ఫ్లిక్స్ లో రిలీజ్‌ చేయనున్నారు. ఇది మూడు నెలల తర్వాత ఓటీటీలో రానుందని సమాచారం. రాజమౌళి రూపొందించిన `ఆర్‌ఆర్‌ఆర్` చిత్రంలో ఎన్టీఆర్‌, రామ్ చరణ్ హీరోలుగా నటించారు. ఆలియా భట్ (Alia Bhatt), అజయ్ దేవగణ్ (Ajay Devgn) కీలక పాత్రలు పోషించారు. మార్చి 25న విడుదలైన ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా రూ.1127కోట్ల భారీ వసూళ్లను రాబట్టింది. అత్యధిక కలెక్షన్లను కొల్లగొట్టిన నాలుగో భారతీయ చిత్రంగా నిలిచింది. ఈ విజువల్ వండర్‌ను థియేటర్స్‌లో మిస్ అయిన వారంతా ఓటీటీలో ఎప్పుడెప్పుడు విడుదలవుతుందని ఎదురు చూస్తున్నారు. సినీ ప్రేక్షకుల ఎదురు చూపులకు తెరదించుతూ ఓటీటీ ప్లాట్‌ఫామ్ మూవీ స్ట్రీమీంగ్ డేట్‌ను ప్రకటించింది.