ట్రిపుల్ ఆర్ కోసం ఫ్యాన్స్ కళ్లు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు. ఇక రిలీజ్ దగ్గర పడుతుండటంతో టీమ ప్రమోషన్స్ హడావిడి మొదలెట్టేశారు. ఎత్తర జెండా సాంగ్ ప్రోమోను రిలీజ్ చేశారు ట్రిపుల్ ఆర్ మేకర్స్.. 

టాలీవుడ్ జక్కన్న రాజమౌళి తెరకెక్కించిన మల్టీ స్టారర్ మూవీ ట్రిపుల్ ఆర్. ఈ సినిమా మరికొద్ది రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. గత కొద్ది రోజులుగా మూవీ నుంచి ఎలాంటి అప్డేట్స్ రాలేదు. దీంతో అభిమానులు సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ కోసం ఎదురు చూశారు. అభిమానులు ఖుషీ చేస్తూ.. రీసెంట్ గా సాంగ్ రిలీజ్ చేయబోతున్నామంటూ మూవీ టీమ్ ప్రకటించారు. 

కరోనా అడ్డంకులు దాటుకుని మార్చి 25న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కు రెడీ అయిపోయింది ట్రిపుల్ ఆర్. ఇఫ్పటికే 13 రోజుల గ్యాప్ ఉండటంతో తమ సినిమాపై మరింత అంచనాలు పెంచేందుకు, మరింత పబ్లిసిటీ కోసం మేకర్స్ సిద్ధమయ్యారు. అయితే గతంలోనే ఈ సినిమాకు వీరలెవల్లో పబ్లిసిటీ ఇచ్చేశారు. అన్న భాషల్లో ప్రమోషన్స్ ను స్వయంగా హీరోలను తీసుకుని వెళ్లి రాజమౌళి చేసేశారు. ఇక ఇప్పుడు విజ్యువల్ గా ప్రమోషన్స్ ను స్టార్ట్ చేశారు టీమ్. 

YouTube video player

ట్రిపుల్ ఆర్ నుంచి సెలబ్రేషన్స్ అంథిమ్ సాంగ్ రిలీజ్ చేయనున్నట్టు అనౌన్స్ చేశారు మేకర్స్. మార్చి 14న ఈ సాంగ్ ను రిలీజ్ చేయనున్నారు. ఎత్తర జెండా అంటూ సాగే అంథిమ్ సాంగ్ కు సంబంధించిన పోస్టర్ ను రెండు రోజులు ముందు రిలీజ్ చేసిన టీమ్ ఇప్పుడు డైరెక్ట్ గా సాంగ్ ప్రోమోను రిలీజ్ చేశారు. ఈ ప్రోమోలో లో ఎన్టీఆర్, రామ్ చరణ్, అలియా భట్ కలిసి జెండా పట్టి.. పిడికిలి బిగబట్టి ఎత్తర జెండా అంటూ పాడిన విజ్యువల్ ఫ్యాన్స్ కు ఎంతగానో అలరిస్తోంది.

ఎత్తర జెండా మెయిన్ సాంగ్ ను మార్చ్ 14న రిలీజ్ కాబోతోంది. ఇక ఈ మూవీలో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా, ఎన్టీఆర్ కొమరం భీంగా నటించారు. ఈ రెండు పాత్రలు జీవితంలోని అజ్ఞాత కాలాన్ని దర్శకుడు రాజమౌళి కల్పితంగా మార్చి తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ చరణ్ జోడీగా సీత పాత్రలో కనిపించబోతున్నారు. వీరితో పాటు ప్రముఖ నటులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. 

దేశం మొత్తం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ట్రిపుల్ ఆర్ నుంచి ఇప్పటి వరకూ రిలీజ్ అయిన మేకింగ్ వీడియోస్ టీజర్స్, గ్లిమ్స్, ట్రైలర్ కు ఊహించని రీతిలో రెస్పాన్స్ వచ్చింది. మార్చి 25న రిలీజ్ కానున్న ఈ చిత్రానికి సంబంధించిన అప్డేట్స్ మార్చి 14 నుంచి రెగ్యూలర్ గా రానున్నాయి. ఇప్పటికే యూఎస్ఏలోనూ అభిమానులు సెలబ్రేషన్స్ చేసేందుకు సిద్ధంగా ఉన్నారు.