`ఆర్‌ఆర్ఆర్` ప్రమోషన్ కార్యక్రమాల జోరు పెంచారు రాజమౌళి టీమ్. అందులో భాగంగా కర్నాటకలో భారీ స్థాయిలో బిగ్గెస్ట్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ని నిర్వహించబోతున్నారు. అయితే ఎన్టీఆర్, చరణ్ ఫ్యాన్స్ నిరాశ చెందుతున్నారు.
రాజమౌళి(Rajamouli).. `ఆర్‌ఆర్‌ఆర్`(RRR Movie)కి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌ని ప్లాన్ చేశారు. అయితే ఇది బిగ్గెస్ట్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌గా ఉండబోతుండటం విశేషం. ఎన్టీఆర్(NTR), రామ్‌చరణ్(Ram Charan) కలిసి నటించిన `ఆర్‌ఆర్‌ఆర్` చిత్రం మార్చి 25న విడుదల కాబోతుంది. డివివి దానయ్య భారీ బడ్జెట్‌తో తెరకెక్కించిన ఈ చిత్రంలో అలియాభట్.. రామ్‌చరణ్ సరసన హీరోయిన్‌గా నటిస్తుంది. బ్రిటీష్ నటి ఒలివియా మోర్రీర్.. ఎన్టీఆర్‌కి జోడిగా కనిపిస్తుందని సమాచారం. అజయ్ దేవగన్, శ్రియా, సముద్రఖని ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.
ఈ సినిమా సంక్రాంతికి విడుదల కానుండగా, కరోనా వల్ల వాయిదా పడింది. దీంతో మరోసారి ప్రమోషన్ కార్యక్రమాలు షురూ చేశారు. అందులో భాగంగా మంగళవారం హైదరాబాద్‌లో తెలుగు మీడియాతో ముచ్చటించింది యూనిట్. ఈ సందర్భంగా అనేక విషయాలను పంచుకుంది యూనిట్. మరోవైపు టీమ్ ఇంటర్వ్యూలిస్తూ ప్రమోషన్ కార్యక్రమాల జోరు పెంచారు. మరోవైపు చెన్నై, బెంగుళూరు, కేరళా, ముంబయిలోనూ మరోసారి ప్రమోషన్ చేయబోతున్నారు.
అందులో భాగంగా ఓ భారీ ఈవెంట్‌కి ప్లాన్ చేశారు రాజమౌళి. కర్నాటకలో ప్రీ రిలీజ్ ఈవెంట్(RRR Pre Release Event)ని నిర్వహించబోతున్నారు. చిక్కాబల్లాపూర్‌లో ఈ నెల 19న(శనివారం) భారీ స్థాయిలో ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ని నిర్వహించబోతున్నారట. ఇండియన్ బిగ్గెస్ట్ ఈవెంట్‌గా ఇది ఉండబోతుందట. ఈ ఈవెంట్‌కి కర్నాటక సీఎం బసవరాజు బొమ్మై, శివరాజ్‌కుమార్, హెల్త్ మినిస్టర్ గెస్ట్ లు గా రాబోతున్నారని తెలుస్తుంది. ఈ సందర్భంగా పునీత్ రాజ్‌కుమార్‌కి మేకర్స్ సినిమాని డెడికేషన్ చేయబోతున్నారని సమాచారం. ఇదిలా ఉంటే తెలుగు నుంచి చిరంజీవి, బాలయ్య గెస్ట్ లుగా వెళ్తారని తెలుస్తుంది.
మరోవైపు చిక్కాబల్లాపూర్‌లో ఈవెంట్ నిర్వహించడానికి కారణాలు హాట్ టాపిక్ అవుతున్నాయి. తెలుగు స్టేట్స్ లో పెడితే ఆ ఈవెంట్ కంట్రోల్‌లో ఉండదని భావిస్తున్నారట. ఎన్టీఆర్, రామ్‌చరణ్‌లకు మాసివ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఓ రకంగా మెగా అభిమానులు, నందమూరి అభిమానులు దిగిపోతారు. ఇరు అభిమానులంటే ఊహకందని విధంగా ఉంటుంది. పైగా `ఆర్‌ఆర్‌ఆర్` సినిమా కావడంతో అభిమానుల తాకిడిని అంచనా వేయడం కష్టమవుతుంది. కరోనా కారణంగా వారిని మ్యానేజ్ చేయడం కూడా కష్టంగా మారుతుందని, కర్నాటకలో ప్లాన్ చేశారని సమాచారం.
చిక్కాబల్లాపూర్ అటు తెలంగాణ, ఇటు ఏపీ బార్డర్‌లో ఉంటుంది. అలా మూడు స్టేట్స్ ని కలిపేలా ఉంటుందని, అన్ని రకాలుగా కలిసొస్తుందని తెలుస్తుందని భావిస్తున్నారట. ఇక ఇండియాలో ఇదొక్కటే ఈవెంట్ ఉంటుందని, మరోటి దుబాయ్‌లో ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. దీంతో ఇప్పుడు తెలుగు ఆడియెన్స్ కి, ముఖ్యంగా ఎన్టీఆర్, చరణ్ అభిమానులకు తీవ్ర నిరాశ చెందుతున్నారు.
