ఇప్పుడు అలియా నెక్ట్స్ కన్ను హాలీవుడ్‌పై పడిందట. ఇక హాలీవుడ్‌లోకి ఎంట్రీకి ప్రయత్నాలు షురూ చేసిందని టాక్‌. ప్రియాంక, దీపికా, ఐశ్వర్య వంటి పలువురు బాలీవుడ్‌ భామలు హాలీవుడ్‌లో నటించి మెప్పించారు.

`ఆర్‌ఆర్‌ఆర్‌` భామ అలియా భట్‌ కలలు చాలా పెద్దగానే ఉన్నారు. ఇన్నాళ్లు బాలీవుడ్‌కే పరిమితమైన ఈ భామ ఇప్పుడు టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తుంది. ఇండియాలోనే ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న `ఆర్‌ఆర్‌ఆర్‌`లో నటిస్తుంది. సీత పాత్రతో తెలుగు ఆడియెన్స్ కి పరిచయం కాబోతుంది.ఈ చిత్రంతో ఇతర సౌత్‌ భాషల్లోనూ కనువిందు చేయనుంది. ఎందుకంటే ఈ చిత్రం దాదాపు పది ఇండియన్‌ భాషల్లో విడుదల కాబోతుంది.

ఇదిలా ఉంటే ఇప్పుడు అలియా నెక్ట్స్ కన్ను హాలీవుడ్‌పై పడిందట. ఇక హాలీవుడ్‌లోకి ఎంట్రీకి ప్రయత్నాలు షురూ చేసిందని టాక్‌. ప్రియాంక, దీపికా, ఐశ్వర్య వంటి పలువురు బాలీవుడ్‌ భామలు హాలీవుడ్‌లో నటించి మెప్పించారు. ప్రస్తుతం ప్రియాంక ఏకంగా హాలీవుడ్‌లో సెటిల్‌ అయిపోయింది. అమెరికన్‌ సినిమాలు తప్ప ఇండియన్‌ సినిమాలు చేయడం లేదు. ఈ నేపథ్యంలో అలియా సైతం హాలీవుడ్‌లో రాణించాలని తపిస్తుందట. నెక్ట్స్ టార్గెట్‌ హాలీవుడ్‌ అనే ప్రచారం బాలీవుడ్‌లో ఊపందుకుంది. 

ఇప్పటికే ఓ హాలీవుడ్‌ చిత్రానికి సైన్‌ చేసేందనే టాక్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది. `డబ్ల్యూఎమ్‌ఈ` అనే హాలీవుడ్‌ టాలెంటెడ్‌ ఎజెన్సీతో అలియా ఓ కంట్రాక్ట్‌ కుదుర్చుకుందని, ఈ సంస్థతో ఓ మూవీకి సంతకం కూడా చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన కూడా వెలువడనున్నట్లు సమాచారం. మరి ఇందులో నిజమెంతా అనేది తెలియాల్సి ఉంది. అయితే అలియా హాలీవుడ్‌ ఆఫర్‌ దక్కించుకోవడం విశేషంగా చెప్పుకోవచ్చు. 

ప్రస్తుతం అలియా తెలుగులో `ఆర్‌ఆర్‌ఆర్‌`లో రామ్‌చరణ్‌ సరసన సీత పాత్రలో నటిస్తుంది. ఇక హిందీలో సంజయ్‌ లీలా భన్సాలీ రూపొందించిన `గంగూబాయి కతియవాడి` చిత్రంలో, `బ్రహ్మాస్త్ర`లో, అలాగే `రాఖీ ఔర్‌ రాణీ కీ ప్రేమ్‌ కహానీ` సినిమా చేస్తుంది. దీంతోపాటు ఇటీవల `డార్టింగ్స్` అనే చిత్రంలో నటిస్తూ నిర్మాతగా మారి నిర్మిస్తుంది.