రామ్ చరణ్ అమెరికన్ మీడియా ఇంటర్వ్యూలో తన భవిష్యత్ ప్రణాళికలు వెల్లడించారు. హాలీవుడ్ లో చిత్రాలు చేయాలనుకుంటున్నట్లు వెల్లడించారు.
రామ్ చరణ్ అరుదైన గౌరవాలు అందుకుంటున్నారు. ఆయన గుడ్ మార్నింగ్ అమెరికా షోలో పాల్గొన్నారు. ఈ ఘనత దక్కించుకున్న మొదటి ఇండియన్ హీరోగా రికార్డులకు ఎక్కాడు. అలాగే ప్రముఖ హాలీవుడ్ మీడియా ABC న్యూస్ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అనేక ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ఆస్కార్ కి నామినేటైన నాటు నాటు సాంగ్ గురించి రిపోర్టర్ ప్రత్యేకంగా అడిగి తెలుసుకున్నారు. యుద్ధం మొదలు కావడానికి ముందు ఉక్రెయిన్ లో ఆ సాంగ్ చిత్రీకరించాము. వారం రోజులు రిహార్సల్, 15 రోజులు షూట్ చేయడం జరిగింది. ఉక్రెయిన్ అందమైన దేశం. ప్రజలు చాలా మంచివారని చరణ్ అన్నారు.
ఇక వేళ నాటు నాటు సాంగ్ కి ఆస్కార్ వస్తే అంతకంటే గొప్ప విషయం ఏమీ లేదన్నారు. 80 ఏళ్ల చరిత్ర కలిగిన ఇండియన్ సినిమా ఆస్కార్ అవార్డు దక్కించుకుంటే అదో అద్భుత ఘట్టంగా భావిస్తాను. దాన్ని బాధ్యతగా భావించి మరిన్ని ఆస్కార్ అవార్డ్స్ గెలుచుకునేందుకు కృషి చేస్తాము. నాటు నాటు సాంగ్ ఆస్కార్ గెలిస్తే దాన్ని సమిష్టి కృషిగా, ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ విజయంగా భావిస్తానని చరణ్ అన్నారు.
ఆర్ ఆర్ ఆర్ మూవీతో మీకు గ్లోబల్ ఫేమ్ వచ్చింది. హాలీవుడ్ చిత్రాలు చేయాలనుకుంటున్నారా? అని అడగ్గా... నేను ఆల్రెడీ కొన్ని ఇండియన్ ప్రాజెక్ట్స్ ఒప్పుకొని ఉన్నాను. అయితే హాలీవుడ్ మేకర్స్ తో పని చేయాలనే కోరిక ఉంది. అవుట్ సైడ్ ఇండియా చిత్రాలు చేయాలనే ప్రణాళికలు ఉన్నాయి. నేను ఇష్టపడే అనేక మంది డైరెక్టర్స్ హాలీవుడ్ లో ఉన్నారు. చూద్దాం.. భవిష్యత్ లో హాలీవుడ్ చిత్రాలు చేసే అవకాశం వస్తుందేమో. నేనైతే సిద్ధంగా ఉన్నాను... అని రామ్ చరణ్ తెలిపారు.
ఖచ్చితంగా మీకు అవకాశాలు వస్తాయని... యాంకర్ రామ్ చరణ్ ఆశలపై విశ్వాసం ప్రకటించారు. రామ్ చరణ్ ఇంటర్వ్యూ వీడియో ఏబీసీ న్యూస్ అధికార సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేశారు. ఇది వైరల్ గా మారింది. ఇక మార్చి 12న ఆస్కార్ వేడుక జరగనుందని సమాచారం. ఆరోజు ఆస్కార్ విషయంలో ఆర్ ఆర్ ఆర్ మూవీ భవితవ్యం తేలనుంది. ప్రస్తుతం రామ్ చరణ్ శంకర్ దర్శకత్వంలో ఆర్సీ 15 చేస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ చాలా వరకు షూటింగ్ పూర్తి చేసుకుంది. నెక్స్ట్ ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు మూవీకి సైన్ చేశారు.
