‘ఆర్‌ఆర్‌ఆర్' అప్డేట్ : ఫైటర్స్ ట్రైనింగ్..150 రోజులు పాటు
టైమ్, డబ్బు కలిసొచ్చేందుకు ట్రైనింగ్ తీసుకున్న ఫైటర్స్ అయితే బెస్ట్ అని రాజమౌళి భావించారుట. ఆయన రకరకాల ఫైట్ సీక్వెన్స్ లు రికార్డ్ చేసి రాజమౌళి ముందు పెడితే వాటిలో కొన్నిటిని ఫైనలైజ్ చేస్తారు. ఆ తర్వాత లొకేషన్ లో చక చకా వాటిని చిత్రీకరిస్తారు.లావిష్ గా షూట్ చేసేందుకు వీలుగా ఈ విధానాన్ని ఫాలో అవుతున్నట్లు తెలుస్తోంది.
ఎన్టీఆర్, రామ్‌చరణ్‌లతో దర్శకుడు రాజమౌళి రూపొందిస్తోన్న మల్టీస్టారర్ ‘ఆర్‌ఆర్‌ఆర్' (రౌద్రం రణం రుధిరం). ఈ చిత్రంలో అద్బుతమైన యాక్షన్ సీక్వెన్స్ ఉంది. ఎన్టీఆర్, రామ్ చరణ్ లపై వీటిని భారీ ఎత్తున ప్లాన్ చేస్తున్నారు. ఈ సీన్ తెరపై చూస్తే కళ్లు చెదిరేలా, ఒకటికి నాలుగు సార్లు జనం వచ్చి చూసి వెళ్లేలా రాజమౌళి ఆలోచన చేసారు. అందుకోసం ప్రత్యేకంగా కొందమంది ఫైటర్స్ కు 150 రోజులు పాటు ట్రైనింగ్ ఇస్తున్నారు.
స్టంట్ మాస్టర్ సాల్మన్ రాజు నేతృత్వంలో ఈ సీక్వెన్స్ చిత్రీకరించనున్నారు. ఆయనే ఈ సీక్వెన్స్ కు కావాల్సిన ఫైటర్స్ కు ట్రైనింగ్ ఇస్తున్నారు.ఇది లెంగ్తీ యాక్షన్ ఎపిసోడ్ కావటం, అదీ పీరియడ్ కాలం నాటిది కావటంతో అనేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. టైమ్, డబ్బు కలిసొచ్చేందుకు ట్రైనింగ్ తీసుకున్న ఫైటర్స్ అయితే బెస్ట్ అని రాజమౌళి భావించారుట. ఆయన రకరకాల ఫైట్ సీక్వెన్స్ లు రికార్డ్ చేసి రాజమౌళి ముందు పెడితే వాటిలో కొన్నిటిని ఫైనలైజ్ చేస్తారు. ఆ తర్వాత లొకేషన్ లో చక చకా వాటిని చిత్రీకరిస్తారు.లావిష్ గా షూట్ చేసేందుకు వీలుగా ఈ విధానాన్ని ఫాలో అవుతున్నట్లు తెలుస్తోంది.
డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ చిత్రంలో అలియా భట్‌తో పాటు ఒలీవియా మోరిస్ కూడా నటిస్తోంది. ఈ సినిమాలో కొమురం భీమ్‌గా ఎన్టీఆర్, అల్లూరి సీతారామరాజు పాత్రలో చరణ్ కనిపిస్తోన్న విషయం తెలిసిందే. రామ్‌చరణ్‌కు (అల్లూరి) జోడీగా సీత పాత్రలో ఆలియా భట్ నటిస్తున్నారు. ఈ సినిమాలో అజయ్ దేవగణ్, శ్రియ, సముద్ర ఖని ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు.