అనుకున్నదంతా అయ్యింది.  ఆర్ ఆర్ ఆర్ ప్రభజనం దేశాలు దాటి వెళ్లింది. అక్కడ మన ఇండియా పేరు మీద ఉన్న కొన్ని రికార్డ్స్ ను బ్రేక్ చేస్తుంది. ఇక జపాన్ లో 24 ఏళ్ళుగా సూపర్ స్టార్ రజనీకాంత్ పేరిట ఉన్న రికార్డ్ ను బ్రేక్ చేసింది ఆర్ఆర్ఆర్. 

తెలుగు సినిమా రేంజ్ ను మార్చేసిన సినిమా ఆర్‌ఆర్‌ఆర్‌. బాహుబలితో స్టార్ట్ అయిన ప్రభంజనం.. ట్రిపుల్ ఆర్ తో ఇంకాస్త పెరిగింది. గ్లోబల్‌ బాక్సాఫీస్ దగ్గర తెలుగు సినిమా సత్తాను ఆర్ఆర్ఆర్ తో మరోసారి చూపించాడు ఎస్‌ఎస్‌ రాజమౌళి. ఆర్‌ఆర్‌ఆర్‌ ప్రాజెక్ట్‌ రిలీజ్ అయినప్పటి నుంచి క్రియేట్ చేసిన రికార్డ్స్ అన్నీ ఇన్నీ కావు. ప్రపంచ వ్యాప్తంగా ట్రిపుల్ ఆర్ చర్చనీయాంశం అయ్యింది.ఈక్రమంలో రీసెంట్ గా జపాన్ లో రిలీజ్ అయిన ట్రిపుల్ ఆర్ అక్కడ కూడా రికార్డ్ ల పరంపర ఆపలేదు. 

బాహుబలి రెండు సినిమాల తరువాత జక్కన్న కాంపౌండ్ నుంచి వచ్చిన ఆర్‌ఆర్‌ఆర్‌ అక్టోబర్‌ 21న జపాన్‌లో విడుదలైన సంగతి తెలిసిందే. కాగా ఆర్‌ఆర్‌ఆర్‌ ఇపుడు అత్యంత అరుదైన రికార్డు ఖాతాలో వేసుకుంది. సూపర్ స్టార్ రజినీకాంత్‌ సినిమాలకు వరల్డ్‌ వైడ్‌గా అభిమానులున్నారు. ముఖ్యంగా జపాన్ లో సూపర్ స్టార్ కు భారీగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. రజనీ కాంత్ తరువాత ప్రభాస్ కు ఆ రేంజ్ లో అక్కడ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అయితే 24 ఏండ్ల కిందట రిలీజ్ అయిన రజనీ కాంత్ ముత్తు సినిమా ఇండియాతో పాటు.. జపాన్ తో కూడా తెగ ఆడేసింది. ఇండియన్ సినిమా సత్తా ఏంటో ప్రపంచానికి తెలిసేలే చేసిన మొదటి సినిమా ముత్తు. 

 భారతీయ సినిమా సత్తా ఏంటో అప్పట్లోనే చూపించాడు తలైవా. జపాన్‌లో అత్యధిక గ్రాస్‌ సాధించిన ఇండియన్‌ మూవీగా ముత్తు సినిమాపై ఉన్న కార్డును ఇన్నేళ్ళకు బ్రేక్ చేసింది ఆర్ఆర్ఆర్ సినిమా. తాజా అప్‌డేట్ ప్రకారం జపనీస్ బాక్సాఫీస్ వద్ద ఆర్‌ఆర్‌ఆర్ 400 మిలియన్ యన్లు అనగా.. 24 కోట్ల 13 లక్షలపైన వసూలు చేసి.. ముత్తు పేరుపై ఉన్న రికార్డును బ్రేక్ చేసింది ఆర్ఆర్ఆర్ మూవీ.


ఇప్పటికే హాలీవుడ్ లో పెద్ద పెద్ద దర్శకుల మన్ననలు పొందిన ఈమూవీ కొన్ని విమర్షలు కూడా ఫేస్ చేసింది. అంతే కాదు ఆస్కార్ రేంజ్ లో కూడా జక్కన్నకు ఈహూవీతో మంచి పేరు వచ్చింది. ఇక ఈమూవీలో అల్లూరి సీతారామ‌రాజు పాత్రలో రాంచరణ్‌.. కోమురం భీమ్ గా ఎన్టీఆర్.. నటించారు. హీరోయిన్లుగా అలియాభట్‌, ఒలివియా మొర్రీస్‌ నటించగా.. బాలీవుడ్ స్టార్స్.. అజయ్‌ దేవ్‌గన్‌, శ్రియాశరణ్‌, , సముద్రఖని కీలక పాత్రలు పోషించారు. డీవీవీ ఎంటర్‌టైన్‌ మెంట్స్‌ బ్యానర్‌పై డీవీవీ దానయ్య భారీ బడ్జెట్‌తో తెరకెక్కించారు. ఆర్ఆర్ఆర్ ప్రపంచవ్యాప్తంగా రూ.1200 కోట్లకుపైగా కలెక్షన్లు వసూళ్లు చేసింది.