ఏపీ టూరిజం శాఖా మంత్రి రోజా తిరుపతిలో సందడి చేశారు, పార్లరంతా సందడి చేస్తూ.. తెగ హడావిడి చేశారు మాజీ హీరోయిన్.  

ఏపీ టూరిజం మంత్రి, మాజీ హీరోయిన్ రోజా తిరుపతిలో సందడి చేశారు. లండన్ బ్యూటోరియం బ్రాంచ్ ను ప్రారంభించిన రోజా తెగ హడావిడి చేశారు. పార్లర్ లో కలియతిరుగుతూ... అక్కడ మహిళలకు అందించబోయే సేవల గురించి తెలుసుకున్నారు. అంతేకాదు స్వయంగా బ్లూటీ పార్లర్ కు చెందిన ప్రొఫెషనల్ తో నెయిల్ కటింగ్ చేయించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడారు రోజా.

ఈ సందర్భంగా రోజా మాల్లాడుతూ.. చెన్నై బేస్డ్ లండన్ బ్యూటోరియం బ్రాంచ్ ను ప్రారంభించడం సంతోషంగా ఉందని చెప్పారు. తిరుపతిలోని మహిళలు అత్యుత్తమ బ్యూటీ సేవలను ఇక్కడ పొందవచ్చని తెలిపారు. బెంగళూరు, చెన్నై, హైదరాబాదుల్లో లభించే నాణ్యమైన సేవలు ఇప్పుడు తిరుపతికి కూడా అందుబాటులోకి వచ్చాయని చెప్పారు. ఈ సందర్భంగా బ్యూటీ క్లినిక్ హెడ్ జీవిత సత్యనారాయణన్, బ్రాంచ్ ఓనర్ ప్రియాంకను ఆమె అభినందించారు.

YouTube video player

ఈమధ్యే మంత్రిగా బాధ్యతలు తీసుకున్నారు రోజ. అప్పటి వరకూ జబర్ధస్త్ లాంటి కార్యక్రమాలకు న్యాయ నిర్ణేతగా ఉన్నఆమె. మంత్రి అయిన తరువాత వాటి నుంచి తప్పుకున్నారు. ప్రస్తుతం తన నియోజకవర్గంలో పనులతో బిజీ బిజిగా గడిపేస్తున్నారు రోజా