కనుల పండుగలా ప్రముఖ కమెడియన్ కుమార్తె పెళ్లి..20 ఏళ్ళ వయసులోనే స్నేహితుడితో నటి వివాహం
ప్రముఖ తమిళ హాస్య నటుడు రోబో శంకర్ కుమార్తె ఇంద్రజ శంకర్ పెళ్లి వేడుక అంగరంగ వైభవంగా జరిగింది.
ప్రముఖ తమిళ హాస్య నటుడు రోబో శంకర్ కుమార్తె ఇంద్రజ శంకర్ పెళ్లి వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. ఇంద్ర శంకర్ కూడా నటిగా రాణిస్తున్నారు. బిగిల్, విరుమాన్, పాగల్ చిత్రాల్లో క్యారెక్టర్ రోల్స్ చేసింది. తమిళనాట ఇప్పుడిప్పుడే దర్శకుడిగా రాణిస్తున్న కార్తీక్ తో ఇంద్రజ వివాహం జరిగింది. ఇంద్రజ, కార్తీక్ స్నేహితులుగా ఉన్నారు. అభిప్రాయాలు కలవడంతో పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయ్యారు. వీరి నిశ్చితార్థం ఫిబ్రవరి 4న జరిగింది.
చెన్నైలో జరిగిన వివాహ వేడుకకి కోలీవుడ్ సెలెబ్రిటీలు కూడా హాజరయ్యారు. తామిద్దరం భగవంతుడి ఆశీస్సులతో ఒక్కటయ్యాం అంటూ పెళ్లి ఫోటోలని ఇంద్రజ సోషల్ మీడియాలో షేర్ చేసింది. వధూవరులు ఇద్దరూ సాంప్రదాయ వస్త్ర ధారణలో మెరిసిపోతున్నారు.
వివాహం తర్వాత తన భర్తకి గోరు ముద్దలు తినిపిస్తున్న వీడియో కూడా ఇంద్రజ అభిమానులతో పంచుకుంది. ఇంద్రజ విజిల్ చిత్రంతో ఫుట్ బాల్ ప్లేయర్ గా నటించింది. విశ్వక్ సేన్ పాగల్ చిత్రంలో ఒక పాటలో మెరిసింది. ఇప్పుడు ఆమె 20 ఏళ్ళ వయసులోనే వివాహ బంధంలోకి అడుగుపెట్టింది.
ఆమె తండ్రి రోబో శంకర్ తమిళనాట పేరున్న కమెడియన్. అంతకు ముందు మిమిక్రీ ఆర్టిస్ట్ గా ఉన్న రోబో శంకర్.. రోబో డ్యాన్స్ తో పాపులర్ అయ్యారు. కోలీవుడ్ లో రోబో శంకర్ స్టార్ హీరోల చిత్రాల్లో కనిపిస్తూ ఉంటారు. ఇప్పుడు తన కుమార్తెకి వివాహం చేసి బాధ్యత నెరవేర్చుకున్నారు.