సాధారణంగా ఇండస్ట్రీలో ఒక్కసారి బ్రేకప్‌ అయితే తమ మాజీ పార్టనర్‌తో మాట్లాడేందుకు, వారి గురించి ప్రస్తావించేందుకు కూడా ఇంట్రస్ట్ చూపించరు. ఒకవేళ పొరపాటున ఎదురుపడినా ముఖం దాచుకొని వెళ్లిపోతారు. కానీ ఓ బాలీవుడ్ నటుడు భిన్నంగా స్పందించాడు. ఇటీవల బ్రేకప్‌ అయిన తన గర్ల్‌ ఫ్రెండ్‌కు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలిపాడు రిత్విక్‌ ధన్జానీ. ఆదివారం తన మాజీ గర్ల్‌ ఫ్రెండ్‌ ఆశా నేగి బర్త్‌ డే సందర్భంగా ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్ చేశఆడు రిత్విక్‌.

తన పోస్ట్‌లో `నువ్వు సొంత ప్రేమకు ఎగ్జామ్‌పుల్‌` అంటూ కామెంట్ చేశాడు రిత్విక్‌. అంతేకాదు `నీ మీద నీకు ఉన్న ప్రేమ కారణంగానే దేవతల కరుణ నీ మీద ఎల్లప్పుడూ ఉంటుంది. నీ జీవితంలో ఓటమి అనేది నీకు ఎప్పుడూ ఉండకూదని నేను ఆకాంక్షిస్తున్నాను. నువ్వు ఎక్కడున్నా నీ నవ్వు వెలుగును విరజిమ్ముతుంది. నీ కరుణ ప్రపంచంలో ఉన్న చెడును తుడిచేస్తుంది` అంటూ తన మాజీ ప్రేయసి మీద ప్రశంసలు కురిపించాడు.

తన కామెంట్‌తో పాటు ఆశానేగి ఓ బుక్‌ చదువుతూ సేద తీరుతున్న పాత ఫోటోను షేర్ చేశాడు. రిత్విక్‌, ఆశాలు దాదాపు ఏడేళ్ల పాటు రిలేషన్‌లో ఉన్న తరువాత 2020లో విడిపోయారు. పవిత్ర రిష్తా షూటింగ్ సందర్భంగా ఈ ఇద్దరు ప్రేమలో పడ్డారు.