Asianet News TeluguAsianet News Telugu

జెనీలియా భర్తకు ప్రెగ్నన్సీ ...ట్రైలర్ బాగుంది కానీ...

ఓ వినూత్న ఐడియాతో వస్తున్న చిత్రమే 'మిస్టర్ మమ్మీ'. ఈ సినిమాలో జెనీలియా, ఆమె భర్త రితేష్ దేశ్ ముఖ్ కలిసి నటించారు. మగవారికి కూడా ప్రెగ్నెన్సీ వస్తే ఏమవుతుందనే క్రేజీ కాన్సెప్ట్ తో వస్తున్న సినిమా ఇది. ఈ విషయాలన్నీ ట్రైలర్ లో చూపించేశారు.

 

Riteish Deshmukh-Genelia Deshmukh starrer Mister Mummy trailer released
Author
First Published Oct 30, 2022, 6:20 AM IST


కొంతమంది హీరోలు ఎంత చేసినా, ఏం చేసినా బ్రేక్ రాదు. అలాంటి హీరోల్లో ఒకరు రితీష్ దేశ్ ముఖ్. తెలుగు హీరోయిన్ జెనీలియాని వివాహం చేసుకున్న ఆయన ఎప్పటికప్పుడు ప్రతీ సీజన్ లోనూ తన అదృష్టాన్ని పరీక్షించుకుంటూనే ఉన్నాడు. ఏదో ఒక సినిమా వదులుతున్నారు. ముఖ్యంగా కామెడీ సినిమాల్లో రితీష్ చేస్తూంటాడు. ఈ సారి ఓ కొత్త తరహా కామెడీతో మన ముందుకు వచ్చే ప్రయత్నం చేసారు.  ఆయన నటించిన 'మిస్టర్ మమ్మీ' అనే సినిమా విడుదలకు సిద్ధమవుతోంది.  ఈ మేరకు ఈ చిత్రం ట్రైలర్ ని విడుదల చేసారు. మీరూ ఓ లుక్కేయండి.

ఈ ట్రైలర్ లో రితేష్, అతడి భార్య జెనీలియా కలిసి నటించారు. షాద్ అలీ ఈ సినిమాను తెరకెక్కించారు. ఇంగ్లాండ్ బ్యాక్ డ్రాప్ లో సినిమా నడుస్తూంటుంది. ఒక కపుల్ మధ్య నడిచే కథ ఇది. భార్య కి పిల్లలంటే ఇష్టం.. కానీ భర్త మాత్రం పిల్లలు వద్దనుకుంటాడు.  అనుకోకుండా భర్తకి  ప్రెగ్నన్సీ వస్తుంది. తనకు అసలు ప్రెగ్నన్సీ ఎలా వచ్చిందో అర్ధంకాక నానా ఇబ్బందులు పడుతుంటాడు . అదే సమయంలో భార్య కూడా ప్రెగ్నెంట్. సీనియర్ నటుడు, దర్శకుడు మహేష్ మంజ్రేకర్ డాక్టర్ గా  కనిపించారు. ఈ పాత్రల మధ్య కామెడీ గా నడుస్తూంటుంది.

ట్రైలర్ జస్ట్ ఓకే అనిపిస్తోంది. కామెడీ సీన్స్ కూడా పెద్దగా నవ్వురావటం లేదు. ఫైనల్ గా  సినిమాలో కొత్త ఎలిమెంట్స్ ఉంటే వర్కవుట్ అవుతుంది.  నవంబర్ 11న సినిమా రిలీజ్ కానుంది. టీసిరీస్ బ్యానర్ పై సినిమాను తెరకెక్కించారు.  ఈ సినిమా ప్రకటన ఇప్పటికే ప్రేక్షకుల్లో విపరీతమైన బజ్‌ని క్రియేట్ చేయగా, ఇప్పుడు వదిలిన ట్రైలర్‌ తో నెక్ట్స్ లెవిల్ కు వెళ్తుందని భావిస్తున్నారు. రితీష్ దేశ్‌ముఖ్ జీవితంలో జరిగే క్రేజీ పరిస్థితుల చుట్టూ కథ తిరుగుతుంది. మిస్టర్ మమ్మీ  సినిమా చాలా ప్రత్యేకమైన కాన్సెప్ట్‌తో రూపొందుతోందని నిర్మాతలు చెప్తున్నారు. సాథియా (2002), బంటీ ఔర్ బబ్లీ (2005), ఓకే జాను (2017), సూర్మ (2018) మొదలైన చిత్రాలకు దర్శకత్వం వహించిన షాద్ అలీ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ఈ సినిమాను టి-సిరీస్ బ్యానర్‌పై భూషణ్ కుమార్, క్రిషన్ కుమార్ నిర్మిస్తున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios