Guppedantha Manasu: బుల్లితెర పై ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు (Guppedantha Manasu) సీరియల్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. కాలేజ్ లో లెక్చరర్ కు స్టూడెంట్ కు మధ్య కలిగే ప్రేమ కథతో సీరియల్ కొనసాగుతుంది. ఇక ఈరోజు మార్చి 11వ తేదీ ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.
ఈరోజు ఎపిసోడ్ లో వసుధార ఇన్నాళ్లు ఈ గెస్ట్ రూమ్ లోకి గెస్ట్ గా వచ్చాను కానీ ఇప్పుడు ఈ ఇంటి మనిషిగా వచ్చాను అదే రూమ్ అదే మనిషి కానీ ఏ మనసులో ఏదో తెలియని ఆనందం అనుకుంటూ సంతోషపడుతూ ఉంటుంది. ఇంతలోనే అక్కడికి వచ్చి అదేంటో వసుధార అనుకోకుండా ఇవాళే రూమ్ సర్ది పెట్టాను అనడంతో నా కోసమే మేడం అని వసుధార ధరణిని హత్తుకుంటుంది. ఇన్ని రోజులు ఇంటికి గెస్ట్ గా వచ్చావు ఈరోజు ఇంటి మనిషిగా వచ్చావు నాకు చాలా సంతోషంగా ఉంది అనడంతో వసుధార కూడా సంతోషపడుతూ ఉంటుంది.
కానీ నువ్వు ఇంట్లో చాలా జాగ్రత్తగా ఉండాలి పెద్ద అత్తయ్య గారు నీ మీద చాలా కోపంగా ఉన్నారు అని ఎంతో ఆవిడ నామీద ఎప్పుడు మేడం కోపంగా లేనిది అని అంటుంది. తనని పట్టించుకోవాల్సిన అవసరం లేదు నా లోకం నా ప్రపంచం నా ఆనందం అంత రిషి సారే అని సంతోష పడుతూ ఉంటుంది వసుధార. ఆ తర్వాత రిషి నిద్రలేచి ఏంటి ఈరోజు ఏంటి ఇంతసేపు నిద్రపోయాను అని మొబైల్ చూస్తూ ఏంటి ఈ పొగరు ఇంకా ఒక మెసేజ్ కూడా చేయలేదు అని అనుకుంటూ ఉంటాడు. ఆ తర్వాత ఏమోలే అనుకుని బయటకు వెళ్ళగా అప్పుడు వసుధర పూజ చేస్తూ ఉండడంతో తన కళ్ళు నులుముకున్న ఏంటి ఇలా తలుచుకోగానే అలా కనిపించింది ఇది నిజమా లేక నా ఊహనా అని అనుకుంటూ ఉంటాడు.
అప్పుడు వసుధార పూజ చేస్తూ ఉండగా ఫోన్ చేయడంతో నిజంగానే వసుధార వచ్చింది అనుకొని ఆశ్చర్యపోతాడు. అప్పుడు రిషి వసుధార ఇంటికి వచ్చిందా వచ్చి నన్ను కలవకపోవడం ఏంటి అని కిందికి వెళ్ళగా అప్పుడు వసుధార పూజ చేస్తూ ఉండటంతో అది చూసి ఆశ్చర్యపోతాడు. నువ్వేంటి ఇక్కడ అనడంతో ఇక్కడే ఉండాలని వచ్చాను సార్ అనగా నువ్వేంటి ఇక్కడ ఉండడమేంటి అని అడుగుతాడు రిషి. ఇదే ప్రశ్న నేను కూడా అడిగాను రిషి అంటూ అక్కడికి దేవయాని వస్తుంది. వసుధార వచ్చి చాలాసేపు అయింది వాళ్ళ నాన్నే స్వయంగా వచ్చి లగేజ్ ఇచ్చి మరీ దిగబెట్టి పోయారు అనడంతో రిషి ఆశ్చర్యపోతాడు. దేవయాని వసుధార పై లేనిపోనివన్నీ చెప్పి చెడగొడుతూ రెచ్చగొడుతూ ఉంటుంది.
నువ్వు ఆ పదిమందిలో వసుధార నా భార్య అన్నందుకే దాన్ని పట్టుకొని ఇంటికి వచ్చేసింది అంటూ నోటికి వచ్చిన విధంగా మాట్లాడుతూ ఉంటుంది దేవయాని. మహేంద్ర, జగతిలు కూడా వత్తాసు పలికారు ఏంటి వసుధార అప్పుడు చాలా మాట్లాడావు ఇప్పుడేం మాట్లాడడం లేదు అని అంటుంది దేవయాని. అప్పుడు రిషి వసుధార కం టు మై రూమ్ అని చెప్పి వెళ్లిపోవడంతో వెళ్ళొస్తాను మేడం అక్కడికి వెళ్లి అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెబుతాను అని అక్కడినుంచి వెళ్ళిపోతుంది వసుధార. వసుధార రిషి గదిలోకి వెళ్ళగా ఏంటి వసుధార ఇది అనడంతో ఆఫీసర్ మీకోసమే తీసుకోవచ్చాను అని అంటుంది.
అసలేంటి నువ్వు ఎందుకు ఇక్కడికి వచ్చావు పైగా మీ నాన్న ఇక్కడ దిగబెట్టి వెళ్లారు అనడంతో మీరు చెప్పిన నిజాన్ని నేను నిజం చేసే ప్రయత్నంలో ఉన్నాను సార్ అని అనడంతో ఆ నిజానిజాలు ఏంటో నీకు నాకు తెలుసు కదా అని అంటాడు రిషి. వచ్చేముందు ఒక్క మాటైనా చెప్పాలి కదా అని అంటాడు రిషి. అసలు ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు అనడంతో మీ ఇష్టం సార్ అనగా నా ఇష్టం ఏంటి నా అనుమతి తీసుకుని ఇంట్లోకి వచ్చావా అని అంటాడు రిషి. తరువాత రిషి కాఫీ నాకు వద్దు అనడంతో వసుధార అక్కడ నుంచి వెళ్ళిపోతుంది.. ఆ తర్వాత రిషి జగతిని నిలదీస్తూ మీరు ఎందుకు ఏం మాట్లాడలేదు మేడం మీకు తప్పుగా అనిపించలేదా అని అడుగుతాడు.
ఈ విషయంలో ఏం మాట్లాడాలో నాకు అర్థం కావడం లేదు అనగా అంటే మీరు ఈ విషయాన్ని సమర్థిస్తున్నారా మేడం అని అంటాడు రిషి. నేను పదిమందిలో చెప్పిన మాటను నిజం అని అన్నావు వసుధార అది నిజం చేస్తోంది నాకు ఏం తెలియడం లేదు అయోమయంగా ఉంది అని అంటుంది జగతి. అప్పుడు వసు జగతి కి ఫోన్ చేసి మిషన్ ఎడ్యుకేషన్ గురించి మాట్లాడాలి అనగా ఇంట్లో మాట్లాడటం ఏంటి అనగా రండి మేడమ్ అంటుంది. ఆ తరువాత వసు, జగతి,మహేంద్ర, ఫణింద్ర అందరు కలిసి మిషన్ ఎడ్యుకేషన్ గురించి మాట్లాడుతుంటారు. అప్పుడు రిషి అక్కడికి రావడంతో మరి నన్ను పిలవలేదు అనగా ఎండీ అంటూ రిషి కి అర్థం అయ్యే విధంగా చెప్పడంతో అందరు వసు ని మెచ్చుకుంటూ ఉంటారు. అప్పుడు రిషి బాగానే సమర్తించుకుంటుంది.
అప్పుడు వసు నేను బాగానే చెప్పానా అనగా అన్ని విషయాలు ఒప్పుకోవడం అందరికీ సాధ్యం కాదు కదా అనగా అప్పుడు మహేంద్ర వీరిద్దరూ ఎక్కడికో వెళ్ళేటట్టుగా ఉన్నారు అనడంతో రిషి అసలు వసుధార అసలు ఏం చెప్పిందంటే అనగా డాడ్ వసుధర గారు చెప్పినట్టు అవన్నీ నాకు పేపర్ మీద రాసి పంపించండి అని రిషి వసుధారకి రివర్స్ లో కౌంటర్ నుంచి అక్కడి నుంచి వెళ్లిపోతాడు. ఇప్పుడు ఏం చేద్దాము వసు అని మహేంద్ర అడగగా సర్ మీటింగ్ ఓవర్ అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోవడంతో ఏంటి జగతి ఇది వీళ్లిద్దరు ఎప్పటికీ ఇంతేనా అర్థం కారా అని అనగా వారిద్దరికీ ఒకరిపై పిచ్చి ప్రేమ ఉంది మహేంద్ర అని అంటుంది జగతి. ఒకరిపై ఒకరు వాదించుకుంటూనే ఉంటారు అని మహేంద్ర అనగా ఇద్దరు తెలివైన వాళ్ళు ఇద్దరు సెల్ఫ్ రెస్పెక్ట్ కాస్త ఎక్కువగా ఉన్నవాళ్లు ఇదే వాళ్ళ ప్రాబ్లం అని అంటుంది జగతి. అప్పుడు జగతి, మహేంద్ర ఇద్దరూ వసుధార రిషిల గురించి మాట్లాడుకుంటూ ఉంటారు.
