Asianet News TeluguAsianet News Telugu

కాస్ట్ ఫీలింగ్, పరువు హత్యలపై వర్మ వాయిస్ తో...

సినిమా మొదట్లో కథకు చెందిన లీడ్ ఇస్తూ కంటెంట్ ని వివరిస్తూ వాయిస్ ఓవర్ లు చెప్పిస్తూంటారు. అయితే ఆ వాయిస్ ఓవర్ ని ఏ స్టార్ హీరో చేతో చెప్పిస్తే సినిమాకు క్రేజ్ వస్తుందని దర్శక,నిర్మాతలు భావిస్తూంటారు.

RGV voice-over for his upcoming film Bhairava Geetha
Author
Hyderabad, First Published Dec 4, 2018, 7:45 AM IST

సినిమా మొదట్లో కథకు చెందిన లీడ్ ఇస్తూ కంటెంట్ ని వివరిస్తూ వాయిస్ ఓవర్ లు చెప్పిస్తూంటారు. అయితే ఆ వాయిస్ ఓవర్ ని ఏ స్టార్ హీరో చేతో చెప్పిస్తే సినిమాకు క్రేజ్ వస్తుందని దర్శక,నిర్మాతలు భావిస్తూంటారు. అయితే రామ్ గోపాల్ వర్మ వాళ్లందరికి డిఫరెంట్.తన సినిమాలకు వేరే వాళ్లు వాయిస్ ఓవర్ ఇవ్వటం మరీ ఓవర్ అనిపిస్తుంది. దాందో ఆయనే ఆ పని చేసేస్తూంటారు. సినిమా ప్రారంభంలోతన వాయిస్ తో మొదలెట్టే ప్రయత్నం చేస్తూంటారు. 

ఇంతకు ముందు రక్త చరిత్ర సినిమాకు అదే పనిచేసారు. లాంగ్ గ్యాప్ తర్వాత భైరవ గీత చిత్రానికి ఆ పనిచేస్తున్నారు. ఈ సినిమా మొదట్లో ఆయన కాస్ట్ ఫీలింగ్స్, పరువు హత్యలపై తన వాయిస్ ని వినిపిస్తారని సమాచారం. అది ఆయన సొంతంగా రాసుకుని, తన అభిప్రాయాలను తనదైన శైలిలో ఆవిష్కరించబోతున్నట్లు సమాచారం. ఆ వాయిస్ ఓవర్ సినిమా ఆశాంతం సాగనుంది.   కథలోని ముఖ్యమైన మలుపులను తన నెరేట్ చేస్తూ వర్మ చెప్పనున్నారని తెలుస్తోంది.

రామ్ గోపాల్ వర్మ  స‌మ‌ర్పిస్తున్న చిత్రం  ‘భైరవగీత’‌.ఆయన శిష్యుడు సిద్ధార్ద్ తాతోలు ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన  ఈ చిత్రం తెలుగులో డిసెంబర్ 14న గ్రాండ్ గా రిలీజ్ కానుంది.   రాయలసీమ నేపధ్యంలో 1991 నాటి కాలంలో ఈ ‘భైరవగీత’ చిత్రం తెరకెక్కింది. ‘తగరు’ సినిమాతో మంచి పేరు తెచ్చుకున్న కన్నడ నటుడు ధనంజయ హీరోగా ఈ చిత్రం రూపొందింది. ఈ చిత్రానికి దర్శకుడు వేరే అయినప్పటికీ.. ఈ చిత్రం మాత్రం పూర్తిగా వర్మ స్టైల్ లోనే తెరకెక్కినట్లు సమాచారం.

తెలుగు, కన్నడ భాషల్లో ఒకేసారి విడుదల కానున్న ఈ సినిమాకు వర్మ దర్శకత్వం వహించకపోయినా.. సిద్ధార్థ్‌కు అన్నివిధాలా సహకరించినట్లు తెలుస్తోంది.  వాస్త‌వ ఘ‌ట‌న‌లు ఆధారంగా తెర‌కెక్కుతున్న ఈ ప్రేమ క‌థ చిత్రంలో ధనుంజయ్, ఇర్రామోర్‌లు ప్ర‌ధాన పాత్ర‌లు పోషించారు.

 

Follow Us:
Download App:
  • android
  • ios