వర్మ తిట్టమాన్నాడు ఓకే... నీ బుద్ది ఏమైంది శ్రీరెడ్డి

First Published 19, Apr 2018, 11:04 AM IST
RGV Revealed sensational news about sri reddy
Highlights

వర్మ తిట్టమాన్నాడు ఓకే... నీ బుద్ది ఏమైంది శ్రీరెడ్డి

టాలీవుడ్ మీద సంచలన ఆరోపణలు చేసి లైమ్ లైట్ లోకి వచ్చిన శ్రీరెడ్డి వెనకున్నది నేనే అంటూ స్వయంగా ఒక వీడియో రిలీజ్ చేశాడు దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. నిర్మాత దగ్గుబాటి సురేష్ బాబు కొడుకు అభిరామ్ విషయంలో సెటిల్ మెంట్ చేసుకోవాలని తాను స్వయంగా శ్రీరెడ్డికి ఫోన్ చేశానని ఐదుకోట్లరూపాయలకు బేరమాడానని కూడా చెప్పుకొచ్చాడు. అంతేకాదు, పవన్ కళ్యాణ్ మీద అలాంటి మాటలు మాట్లాడమంది కూడా తానేనని చెప్పుకొచ్చాడు దర్శకుడు రామ్ గోపాల్ వర్మ.

అయితే, వర్మ చెబుతోన్న ఈ మాటల్లో నిజమెంత అన్నది ప్రశ్నార్థకంగా మారింది. మహిళా సంఘనేతలపై అసభ్య వాఖ్యలు చేసి, పోలీస్ విచారణ ఎదుర్కొన్న వర్మ, కొంతకాలంగా సోదిలో లేకుండాపోయిన సంగతి తెలిసిందే. మళ్లీ తాను లైమ్ లైట్ లోకి వచ్చేందుకే శ్రీరెడ్డి-పవన్ ఇష్యూని తనపై వేసుకున్నాడా అన్నది వర్మకే తెలియాలి. ఇదంతా వింటున్న జనం వర్మకు బుద్ధిలేదు.. నీకు ఏమైంది అని అంటున్నారు.

loader