దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ ఈ రేంజిలో  రెచ్చిపోవటం ఈ మధ్యకాలంలో ఎవరూ చూడలేదు. తన శిష్యుడు హిట్ కొట్టడంతో ఆయన మందు కొట్టి మరీ రెచ్చిపోయారు.  వర్మ ‘ఇస్మార్ట్‌ శంకర్‌’ సక్సెస్‌ పార్టీలో తెగ హంగామా చేశారు. ఆనందంతో మద్యం సీసాను తలపై పోసుకున్నారు. ఆయన అలా చేస్తుంటే పార్టీలో ఉన్న యూనిట్‌ మొత్తం చప్పట్లు కొడుతూ, కేకలు పెట్టారు. 

అనంతరం వర్మను పూరీ జగన్నాథ్ హత్తుకోగా.. ఛార్మిని వర్మ హత్తుకున్నారు. ఈ సందర్భంగా తీసిన వీడియోను ఆర్జీవీ ట్విటర్‌లో షేర్‌ చేశారు. ‘నాకు పిచ్చిలేదు. ‘ఇస్మార్ట్‌ శంకర్‌’ నాకు పిచ్చిపట్టించింది. దీనికి పూరీ, ఛార్మిలను నిందించండి’ అని పోస్ట్‌ చేశారు. ఇప్పుడు మరోసారి ట్విట్టర్ లో రెచ్చిపోయారు.  

అరేయ్ జగన్‌గా (పూరీ జగన్నాథ్). ఇట్టాంటి బ్లాక్‌బస్టర్లు తీసే దమ్ముండి కూడా ఎందుకు తియ్వవురా బాడ్‌కవ్ అంటూ ట్వీట్ చేశారు.  ఈ ట్వీట్ వైరల్ అయ్యింది. సినిమా కన్నా ఎక్కువగా వర్మ హంగామా గురించే జనం మాట్లాడుకోవటం విశేషం. 

అలాగే ఈ ట్వీట్ కు  ఇస్మార్ట్ హీరో రామ్, హీరోయిన్లు నభా నటేష్, నిధి అగర్వాల్‌లతోపాటు చార్మిని సైతం ట్యాగ్ చేశాడు. దీనికి పూరీ కంటే ముందు స్పందించిన చార్మి సార్ పూరీకి నేను చాలా సార్లు చెప్పాను. ఆయన ఫ్యాన్స్ ఫుల్ మీల్స్ కోరుకుంటున్నారు. జగన్ బలం ఎంటర్‌టైన్మెంట్ ఇస్మార్ట్ శంకర్ దాన్ని నిరూపించింది. ఇప్పుడు ఇంకా తిట్టండని అలా తిడితే అన్నా ఇలాగే హిట్లు కొడతాడని ఆర్జీవీ ట్వీట్‌కి చార్మి బదులిచ్చింది. ఇక వర్మ బూతు ప్రేమకు స్పందించిన పూరీ జగన్నాథ్ సార్ మీ తిట్లకు నేను అర్హుడినే, లవ్యూ అంటూ ఆయన కూడా గురువు మీద ప్రేమను చాటుకున్నాడు.