రామ్ గోపాల్ వర్మకు కోపం వచ్చింది. పట్టరాని కోపం వచ్చింది. అది కూడా ఒక ప్రొడ్యూసర్ పై కోపం వచ్చింది. ఇక ఏమాత్రం ఆలస్యం చేయబకుండా ఆయన మీద పోలీస్ కంప్లైయింట్ ఇచ్చాడు వర్మ. ఇంతకీ ఆ ప్రోడ్యూసర్ పై వర్మ ఎందుకు కంప్లైయింట్ ఇచ్చాడు.

సంచలనాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నాడు. అయితే ఆయన రీసెంట్ గా కొండా సినిమాను రిలీజ్ చేశాడు. ఆ మూవీ అసలు పత్తాలేకుండా పోయిన సంగతి తెలిసిందే.. ఇకవెంటనే ఆలస్యం చేయకుండా నెక్ట్స్ తాను రెడీ చేసి పెట్టుకున్న తాజా చిత్రం లడ్కీ: ఎంటర్ ది గర్ల్ డ్రాగన్ ను రంగంలోకి దింపడానికి సన్నాహాలు చేసుకున్నాడు. ప్రి రిలీజ్ కూడా గ్రాండ్ గా చేశాడు. అయితే అంతలోనే ఈ సినిమా విడుదలకు బ్రేక్ పడింది. 

లడ్కీ సినిమా రిలీజ్ ను ఆపేయాలంటూ హైదరాబాదులోని సివిల్ కోర్టు ఆదేశాలను జారీ చేసింది. నిర్మాత శేఖర్ రాజు ఈవిధంగా కోర్ట్ లో ఫిర్యాదు చేయడంతో ఆదేశాలు జారీ అయ్యాయి. తన దగ్గర చాలాసార్లు వర్మ డబ్బులు తీసుకున్నాడని. ఈ సినిమా కోసం తీసుకన్న డబ్బులు తిరిగి ఇవ్వడంలేదంటూ శేఖర్ రాజు పిర్యాదు చేశాడు. ఇక కోర్డ్ ఆదేశాలతో సినిమా ఆగిపోవడంతో వర్మ కూడా నిర్మాత శేఖర్ రాజుపై పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

పోలీసులకు ఫిర్యాదు చేసిన అనంతరం మీడియాతో వర్మ మాట్లాడుతూ... శేఖర్ రాజే తనకు డబ్బులు ఇవ్వాలని చెప్పారు. 'లడ్కీ' సినిమాపై తప్పుడు సమాచారం ఇచ్చి కోర్టును తప్పుదోవ పట్టించారని మండిపడ్డారు. శేఖర్ రాజుకు తాను ఇవ్వాల్సింది ఏమీ లేదని చెప్పారు. తప్పుడు సమాచారంతో తన సినిమాను నిలుపుదల చేయించిన శేఖర్ రాజుపై చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరానని తెలిపారు. సినిమాపై ఆధారపడి ఎంతో మంది బతుకున్నారని. ఇలా అర్ధాంతరంగా సినిమా ఆగిపోతే చాలా మంది నష్టపోవల్సి వస్తుందన్నారు. శేఖర్ రాజు పై చర్యలు తీసుకోవాలంటూ ఫిర్యాదు చేశారు ఆర్జీవి.