Asianet News TeluguAsianet News Telugu

ఆర్జీవీ ఐడియా అదిరిందిగా, అక్కడ అలీ ఫ్యామిలీ సందడి.. ఈ రోజు టాలీవుడ్ అప్డేట్స్ 

ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ‘యువర్ ఫిల్మ్’ అనే కాన్సెప్ట్ ని ప్రెస్ మీట్ ద్వారా వివరించారు. ప్రేక్షకులే సినిమా హిట్ ఫ్లాప్ నిర్ణయిస్తారు కాబట్టి, ఆ ప్రేక్షకులే సినిమాకు సంబంధించిన హీరో, హీరోయిన్, డైరెక్టర్, సినిమాటోగ్రాఫర్ ని నిర్ణయిస్తారు అని తెలిపారు.  

RGV new idea to make films here is details dtr
Author
First Published Apr 6, 2024, 10:12 PM IST

ప్రజలు ఎన్నుకున్న టీమ్ తో ఆర్జీవీ మూవీ.. 

ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ‘యువర్ ఫిల్మ్’ అనే కాన్సెప్ట్ ని ప్రెస్ మీట్ ద్వారా వివరించారు. ప్రేక్షకులే సినిమా హిట్ ఫ్లాప్ నిర్ణయిస్తారు కాబట్టి, ఆ ప్రేక్షకులే సినిమాకు సంబంధించిన హీరో, హీరోయిన్, డైరెక్టర్, సినిమాటోగ్రాఫర్ ని నిర్ణయిస్తారు అని తెలిపారు.  వారితో పాటు టెక్నీషియన్స్ ని కూడా ప్రజలే తన వెబ్ సైట్ లో ఓటింగ్ పద్దతిలో ఎంచుకుంటారట. అందులో ముందంజలో ఉన్న వారితో తాను సినిమా నిర్మించి ఆరు నెలల్లో రిలీజ్ చేస్తానని ప్రకటించారు. సినిమా కథనీ రాంగోపాల్ వర్మ వెబ్సైటులో ఒక రెండు లైన్లులో పెట్టి.. ఆ కథ లైన్ నచ్చిన యాక్టర్స్ , డైరెక్టర్స్, డిఓపి, మ్యూజిక్ డైరెక్టర్ ఇలా అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. ఉదాహరణకి హీరో కొసం ఒక 1000 మంది అప్లై చేస్తే అందులో నుండి ఒక 50 మందిని RGV డెన్ టీమ్ షార్ట్ లిస్ట్ చేసి వెబ్సైట్ లో పెడతారు, ఆ తర్వాత RGV పెట్టే టాస్క్ లని బట్టి వారు ఆడిషన్స్ ఇస్తూ ఉంటారు, ఆ ఆడిషన్స్ లో ప్రేక్షకులకు ఎక్కువ ఎవరు నచ్చితే అతను హీరోగా సినిమా తీస్తారు. ఇదే తరహాలో హీరోయిన్, డైరెక్టర్స్, డిఓపి ఇలా అందరూ కూడా ప్రేక్షకుల ద్వారా ఎన్నుకోబడతారు..

ప్రజల చేత, ప్రజల కొరకు, ప్రజల కోసం ఎన్నుకున్నదే ప్రజాస్వామ్యం అలానే ప్రేక్షకుల చేత, ప్రేక్షకుల కొరకు, ప్రేక్షకుల కోసం చేసే సినిమాలే ఈ యువర్ ఫిల్మ్ ఐడియా, ఈ యువర్ ఫిల్మ్ అనేది భాషతో సంబంధం లేకుండా అన్ని భాషల వారితో నిర్మాణం RGV డెన్ నుండి జరుగుతుంది. 

అలీ చేతుల మీదుగా అతియాస్ కిచెన్ గొప్ప ప్రారంభం

ఏప్రిల్ 5 శుక్రవారం గండిపేట మెయిన్ రోడ్, షాప్ నంబర్ 6లో అతియాస్ కిచన్ ని సినీ నటులు ఆలీ, సతీమణి జుబెదా ఆలీతో ముఖ్య అతిధిగా విచ్చేసి గ్రాండ్ గా ప్రారంభించడం జరిగింది. పవిత్ర రంజాన్ మాసంలో ఉపవాస దీక్షలో ఉన్న ఆలీ కుటుంబం ఈరోజు ఇఫ్తార్ విందుని అతియాస్ కిచెన్ లో కుటుంబ సమేతంగా విచ్చేసి, సాయంత్రపు అల్లా ప్రార్థన అనంతరం ప్రారంభించారు..

RGV new idea to make films here is details dtr
 
ఆలీ మాట్లాడుతూ: నాకు షేక్ యూసఫ్, అతియా ఇద్దరూ మలేసియాలో పరిచయం, అక్కడ కూడా వీరికి హోటల్స్ ఉన్నాయి, కానీ ఇండియాలో హైదరాబాద్లో కిచెన్ ఓపెన్ చెయ్యాలని ఎప్పుడో అన్నారు, 2023 డిసెంబర్ లోనే ప్రారంభం అవ్వాలిసింది,  కానీ ఇప్పుడు ఈ పవిత్ర రంజాన్ మాసంలో ప్రారంభించడం చాలా సంతోషంగా ఉంది. వీరి దగ్గర ఇండో, అరబిక్ రుచులే కాక్కుండా ఢిల్లీ రుచులు, నెల్లూరు రుచులు కూడా అద్భుతంగా ఉంటాయి, మొన్న మా ఇంటికి నెల్లూరు స్టైల్ లో వంటలు చేసి పంపారు.. నిజంగా అద్భుతంగా ఉన్నాయి ఆ టేస్ట్లు..

జుబెదా ఆలీ మాట్లాడుతూ.. భోజన ప్రియులకు అతియాస్ కిచెన్ అనేది మంచి వేదిక, నార్త్ ఇండియన్, అరబిక్,  వెజ్, నాన్ వెజ్ అన్ని రకాల రుచులు వీరి దగ్గర ఉన్నాయి.. మండీ కూడా ఇక్కడ చాలా స్పెషల్, కోకాపేటలో మెయిన్ సెంటర్ లో ఇంత పెద్ద కిచెన్ పెట్టడం నిజంగా హ్యాపీగా ఉంది. 

‘కథ వెనుక కథ’కి ఓటీటీలో మంచి స్పందన

వేసవిలో ఓటీటీ సినిమాలకు మంచి ఆదరణ ఉంటుంది. ఇంటిల్లిపాది చూసే సినిమాలకు మరింత ఆదరణ ఎక్కువ. అందులోనూ సస్పెన్స్ క్రైం థ్రిల్లర్స్ మూవీస్ అంటే అన్ని రకాల కుటుంబ ప్రేక్షకులు ఇష్టపడతారు. హాయిగా కూర్చొని సినిమా చూస్తూ కాసేపు థ్రిల్ అయితే ఆ మజాయే వేరు. అందుకే ఇప్పుడు ఈటీవీ విన్ లో విడుదలైన డీసెంట్ సస్పెన్స్ క్రైం థ్రిల్లర్ ‘కథ వెనుక కథ’ చిత్రానికి మంచి ఆదరణ లభిస్తోంది. విడుదలైన కొద్దికాలంలోనే ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది.

ప్రముఖ హాస్యనటుడు సునీల్, యువ హీరో విశ్వంత్ దుడ్డుంపూడి, శ్రీజిత గౌష్, శుభశ్రీ, ఆలీ, జయప్రకాశ్, బెనర్జీ, రఘుబాబు, సత్యం రాజేష్, మధునందన్, భూపాల్, ఛత్రపతి శేఖర్, ఖయ్యుం, రూప తదితరులు నటించిన ఈ చిత్రానికి శ్రవణ్ భరద్వాజ్ సంగీతం అందించారు. నేపథ్య సంగీతం ఈ చిత్రానికి హైలైట్ గా నిలిచింది. ఈ చిత్రానికి దర్శకత్వం వహించిన కృష్ణ చైతన్య... వైవిధ్యమైన వివిధ రకాల కథ... కథనాలతో ప్రేక్షకుల్ని అనుక్షణ థ్రిల్ కు గురిచేశారనే చెప్పొచ్చు. ముఖ్యంగా క్లైమాక్స్ లో సునీల్ ఇచ్చే ట్విస్ట్ ఔరా అనిపిస్తుంది. దర్శకుడు అయ్యి... తన మేనమామ కూతురుని పెళ్లి చేసుకుని సెటిల్ అవ్వాలనుకునే హీరో విశ్వంత్... ఓ అప్ కమింగ్ డైరెక్టర్ నిజజీవితంలో సినిమా ఛాన్సుల కోసం ఎలాంటి ఇక్కట్లు ఎదుర్కొంటారో... అలాంటి హార్డిల్స్ ఇందులో కళ్లకు కట్టినట్టు చూపించారు దర్శకుడు. 

అందుకు తగ్గట్టుగానే విశ్వంత్ నటన ఇందులో ఉంటుంది. ఆలీ, సత్యం రాజేష్, ఛత్రపతి శేఖర్... ఇలా ఇందులో నటించిన వారంతా తమ శక్తిమేరకు నటించి మెప్పించారనే చెప్పొచ్చు. అలాంటి సినిమాని ఇప్పుడు ఓటీటీలో ఆడియన్స్ ఆదరిస్తున్నందుకు నిర్మాత అవనీంద్రకుమార్ ఆనందం వ్యక్తం చేశారు. నిర్మాణ విలువలను ఎంతో ఉన్నతంగా తీర్చిదిద్దడంలో ఎక్కడా ఖర్చుకు వెనుకాడలేదని... అందుకే ఇప్పుడు ఈటీవీ విన్ లో స్ట్రీమింగ్ అవుతున్న మా సినిమాని ఆడియన్స్ అంతలా ఆదరిస్తున్నారన్నారు. ఇది మాకు ఎంతో బూస్టప్ నిచ్చిందన్నారు. ఈ సినిమాకి పనిచేసిన నటీనటులు, సాంకేతిక నిపుణులందరూ ఎంతో కష్టపడటం వల్లే సినిమా ఇంత క్వాలిటీగా వచ్చిందని... వారందరికీ కృతజ్ఞతలు అన్నారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios