ఇద్దరమ్మాయిల మధ్య కలిగిన ప్రేమ ఎలాంటి పరిస్థితులకి దారి తీసింది? అనే థ్రిల్లింగ్ అంశాలతో క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందిన సినిమా ‘మా ఇష్టం’. భారతదేశంలోనే మొట్టమొదటి పూర్తి స్థాయి లెస్బియన్ చిత్రంగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది
కెరీర్ ప్రారంభం నుంచి వైవిధ్యభరితమైన చిత్రాలు తీస్తూ ముందుకువెళ్తున్నారు దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. అయితే ఈ మధ్యన ఆయన వైవిధ్యం పేరుతో వింత సినిమాలు,వెరైటీ కాన్సెప్టులను తెరకెక్కిస్తున్నారు. ముఖ్యంగా శృంగారానికి ఆయన పెద్ద పీట వేస్తున్నారు. ఒకప్పుడు వర్మ అంటే ఓ కొత్త తరహా సినిమా చూస్తామనే ఆ పేరును ఆయన ఎప్పుడో పోగొట్టుకున్నారు. ముఖ్యంగా ఓటీటీలు వచ్చాక మరీ రెచ్చిపోతున్నారు. ఓటిటి ప్లాట్‌ఫామ్‌లను దృష్టిలో ఉంచుకునే సినిమాలను తీస్తున్నారు. తాజాగా అలాంటి కాన్సెప్ట్‌తోనే ఆయన ఇంకో సినిమాను ముస్తాబు చేసి రిలీజ్ కు రెడీ చేసారు. ముందుగా ఈ మూవీకి డేంజరస్ అని పేరు పెట్టారు. కానీ టైటిల్‌కు.. కథకు పోలిక లేదని చెప్పి టైటిల్‌ను మార్చారు. ఈ క్రమంలోనే డేంజరస్ సినిమా పేరును మా ఇష్టంగా మార్చి ట్రైలర్ వదిలారు.
ట్రైలర్‌ను చూస్తుంటేనే వర్మ ఏంటి ఇలాంటి సినిమా తీసాడని ఖచ్చితంగా అంటారు. ట్రైలర్ అంతా అసభ్యంగానే ఉంది. ఏప్రిల్ 8న ఈ సినిమాని థియేటర్లలో విడుదల చేయనున్నట్లు చిత్ర టీమ్ ప్రకటించింది. రామ్‌గోపాల్ వర్మ మాట్లాడుతూ– ‘‘ఇద్దరమ్మాయిల మధ్య కలిగిన ప్రేమ ఎలాంటి పరిస్థితులకి దారి తీసింది? అనే థ్రిల్లింగ్ అంశాలతో క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందిన సినిమా ‘మా ఇష్టం’. భారతదేశంలోనే మొట్టమొదటి పూర్తి స్థాయి లెస్బియన్ చిత్రంగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది’’ అన్నారు.
మా ఇష్టం సినిమాలో నైనా గంగూలీ, అప్సర రాణిలు ప్రధాన పాత్రల్లో నటించారు. క్రైమ్ థ్రిల్లర్‌గా మూవీ సాగుతుందని వర్మ ప్రకటించారు. ఈ క్రమంలోనే ఈ సినిమా స్టోరీ లైన్‌ను కూడా ఆయన చెప్పేశారు. ఇద్దరు ప్రేమికులైన యువతుల మధ్య జరిగే స్టోరీయే ఈ సినిమా అని తెలిపారు. ఇద్దర అమ్మాయిల గాఢ ప్రేమకు నిదర్శనమే ఈ సినిమా అని రామ్ గోపాల్ వర్మ తన ట్విట్టర్‌లో పోస్ట్ పెట్టారు. ప్రేమకు లింగ బేధం లేదని ఈ చిత్రం ద్వారా వర్మ చెప్పకనే చెప్పినట్లు తెలుస్తోంది.
