Asianet News TeluguAsianet News Telugu

దెయ్యం దుమ్ము దులిపి, వర్మ ట్రైలర్ వదిలాడు

. అందరూ ఆ సినిమాని మర్చిపోయిన ఈ సమయంలో మళ్లీ ఆ దెయ్యాన్ని బయిటకు తీసి వదలటానికి సిద్దపడుతున్నారు రామ్ గోపాల్ వర్మ. ఆర్జీవి దెయ్యం టైటిల్ తో ఆడియన్స్ ముందుకు రాబోతున్నాడు.

RGV Deyyam Locks its Release Date jsp
Author
Hyderabad, First Published Apr 7, 2021, 2:19 PM IST

దెయ్యం సినిమాలకు పెట్టింది పేరు రామ్ గోపాల్ వర్మ. ఈ మద్యన అంటే స్పీడు తగ్గించాడు కానీ ,ఆ మధ్యన వరసపెట్టి దెయ్యం సినిమాలను చేస్తూనే ఉన్నాడు. ఆ క్రమంలోనే రాజ్ శేఖర్ ప్రధాన పాత్రలో పెట్టి ఓ దెయ్యం సినిమా లాగేసాడు. అయితే ఆ సినిమా పూర్తి అయ్యి ఇన్నేళ్లు అయినా రిలీజ్ కు మాత్రం నోచుకోలేదు. అందరూ ఆ సినిమాని మర్చిపోయిన ఈ సమయంలో మళ్లీ ఆ దెయ్యాన్ని బయిటకు తీసి వదలటానికి సిద్దపడుతున్నారు రామ్ గోపాల్ వర్మ. ఆర్జీవి దెయ్యం టైటిల్ తో ఆడియన్స్ ముందుకు రాబోతున్నాడు. ఈ మేరకు ట్రైలర్ ని సైతం వదిలారు. 

ఈ సినిమాలో సీనియర్ హీరో రాజశేఖర్ ప్రధాన పాత్రలో నటిస్తుండగా.. స్వాతి దీక్షిత్, తనికెళ్ళ భరణి, అనితా చౌదరి, జీవ, బెనర్జీ వంటి నటులు కీలక పాత్రలలో నటిస్తున్నారు. ఈ మూవీ ఏప్రిల్ 16న తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషలలో విడుదల కానుంది. చాలా కాలం తర్వాత వర్మ నుంచి వస్తున్న హారర్ సినిమా కావడంతో ప్రేక్షకులు ఆసక్తిగా చూస్తారని భావిస్తున్నారు. అయితే మారిన కాలంలో ఇలాంటి పాతబడ్డ సినిమాలకు ఎంతవరకూ ఆదరణ దక్కుతుందనేది వేచి చూడాల్సిన విషయం. 

 ఈ సందర్బంగా ఆర్జీవి మాట్లాడుతూ.. ఈ సినిమాలో రాజశేఖర్ మేకప్ లేకుండా నటించారని.. ఆయన కూతురుగా స్వాతి దీక్షిత్ నటించిందని చెప్పుకోచ్చాడు. ఈ సినిమా ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేస్తారని.. అందరికి నచ్చుతుందని తెలిపాడు.  

చిత్ర నిర్మాతలు మాట్లాడుతూ.. రాంగోపాల్ వర్మ బర్త్ డే సందర్భంగా "Rgv దెయ్యం" ట్రైలర్ ను విడుదల చేస్తున్నాము. మమ్మల్ని ఆశీర్వదించాలని కోరుతున్నాము. ఆయన తీసిన ఈ సినిమా అద్బుతంగా వచ్చింది. ఈ సినిమాను ఈ నెల 16 న విదుడల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాము ? నిన్న విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ కు చాలా అద్భుతమైన రెస్పాన్స్ వస్తుంది. RGV మార్క్ ఉంది కాబట్టి.చిత్ర ట్రైలర్ కు కూడా అద్భుతమైన రెస్పాన్స్ వస్తుంది. 

ట్రైలర్ చూస్తుంటే రాజశేఖర్ కూతురి పాత్రలో నటించిన స్వాతి దీక్షిత్ యాక్షన్ సన్నివేశాలు బాగున్నాయి..అలాగే రాజశేఖర్ తన పాత్ర కోసం మేకప్ లేకుండా, రియల్ గెటప్‌లో నటిస్తుండటం విశేషం. చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని ఈ నెల 16 న RGV "దెయ్యం" చిత్రాన్ని 5 భాషలలో తెలుగు, తమిళం, మలయాళం,కన్నడ, హిందీ భాషలలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాము ?. అలాగే ఈ చిత్రం అందరికీ నచ్చడంతో పాటు సినిమాను చూసిన ప్రేక్షకులందరూ తప్పకుండా ఎంజాయ్ చేస్తారని అన్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios