Asianet News TeluguAsianet News Telugu

అఫీషియల్: వర్మ ‘ప‌వ‌ర్ స్టార్’ రిలీజ్ డేట్

ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వర్మ.. తాజాగా తెర‌కెక్కిస్తున్న చిత్రం ‘ప‌వ‌ర్ స్టార్: ఎన్నిక‌ల ఫ‌లితాల త‌ర్వాత క‌థ‌‌’. ఇందులో అచ్చంగా హీరో ప‌వ‌న్ క‌ల్యాణ్‌ను పోలిన వ్యక్తి హీరోగా న‌టిస్తున్న విష‌యం తెలిసిందే. 

RGV announces the release date of Powerstar
Author
Hyderabad, First Published Jul 19, 2020, 11:06 AM IST

ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ తాజాగా ‘ప‌వ‌ర్ స్టార్: ఎన్నిక‌ల ఫ‌లితాల త‌ర్వాత క‌థ‌‌’  అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.   ఇందులో అచ్చంగా హీరో ప‌వ‌న్ క‌ల్యాణ్‌ను పోలిన వ్యక్తి హీరోగా న‌టిస్తున్నారు.వివాదాస్పద సబ్జెక్టు కావటంతో ఈ సినిమాపై మంచి అంచనాలే ఏర్పడ్డాయి. ఈ నేపధ్యంలో వర్మ తన తాజా చిత్రం ట్రైలర్ చూడటానికి సైతం రేటు ఫిక్స్ చేసారు. వ్యంగ్యాత్మక మూవీగా క‌నిపిస్తోన్న ఈ సినిమా ట్రైల‌ర్ జూలై 22న ఉద‌యం 11 గంట‌ల‌కు విడుద‌ల కానుంది. 

అయితే ఓ కండీష‌న్‌! 25 రూపాయ‌లు చెల్లించిన త‌ర్వాతే ఆర్జీవీ వ‌ర‌ల్డ్ థియేట‌ర్‌లో ట్రైల‌ర్‌ను చూసే అవ‌కాశం ఉంటుంది. ఇలా ట్రైల‌ర్ చూసేందుకు డబ్బులు వ‌సూలు చేస్తోన్న తొలి చిత్రం ఇదే కావ‌డం విశేషం. అలాగే ఈ సినిమా... జూలై 25న ఉద‌యం 11 గంట‌ల‌కు ఆర్జీవీ వ‌ర‌ల్డ్ థియేట‌ర్‌లో విడుద‌ల కానుంది. ఇక ఇప్ప‌టికే 'ప‌వ‌ర్ స్టార్' సినిమా నుంచి విడుద‌లైన అనేక ఫొటోలు సోష‌ల్ మీడియాను షేక్ చేసిన సంగ‌తి తెలిసిందే.

ఇక ఈ సినిమాలో  పీకే, ఎమ్‌ఎస్, ఎన్‌బీ, టీఎస్, ఓ రష్యన్‌ మహిళ, నలుగురు పిల్లలు, ఎనిమిది బర్రెలు, ఆర్జీవీ ముఖ్య పాత్రలు చేయనున్నారు. ఈ సినిమాలోని పాత్రలు ఎవరో అర్థం చేసుకోవడానికి ఎటువంటి బహుమతులు ఇవ్వబడవు  అని వర్మ వెటకారంగా అన్నారు. అలాగే ఈ సినిమా గురించి కొద్ది రోజుల క్రితం ఓ వ్యక్తి వీడియోను కూడా విడుదల చేసి, ‘‘నా ‘పవర్‌ స్టార్‌’ చిత్రంలో నటించే హీరో ఇతనే. అతను మా కార్యాలయానికి వచ్చినప్పుడు ఈ షాట్‌ చిత్రీకరించాం. ఇతన్ని ఎక్కడైనా చూసినట్టు అనిపిస్తే అది యాధృచ్చికమే’’ అని కూడా వర్మ ట్వీట్‌ చేశారు. 

 ఈ సినిమా నుంచి "గ‌డ్డి తింటావా?" పాట‌ నేడు సాయంత్రం ఐదు గంట‌ల‌కు విడుద‌ల కానుంది. ఇక ఈ పాట‌లో హీరో త‌న గేదెలు, మొక్క‌ల‌ను ఉద్దేశిస్తూ పాడతాడ‌ని ఆర్జీవీ పేర్కొన్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios