బుల్లితెరపై నెంబర్ వన్ రియాలిటీషోగా దూసుకుపోతుంది బిగ్ బాస్. తెలుగులో ఇప్పటికే రెండు సీజన్ లను పూర్తి చేసుకున్న ఈ షో మూడో సీజన్ కి సిద్ధమవుతోంది. అయితే ఈ షోలో రేణుదేశాయ్ పాల్గొనబోతుందని వార్తలు వినిపించాయి.

బిగ్ బాస్ నిర్వాహకులు రేణుని కలిశారని, ఈ  విషయంపై ఆమె సానుకూలంగా స్పందించినట్లు వార్తలు వచ్చాయి.  తాజాగా ఈ విషయంపై స్పందించింది రేణుదేశాయ్. తాను బిగ్ బాస్ షోలో పాల్గొనడం లేదని స్పష్టం చేసింది. అయితే బిగ్ బాస్ షోకి వ్యాఖ్యాతగా వ్యవహరించాలని భావిస్తున్నట్లు చెప్పింది. బిగ్ బాస్ లో పాల్గొనబోతున్నారా..? అని చాలా మంది మెసేజ్ చేస్తున్నారని.. తనకు అలాంటి ఆలోచన లేదని స్పష్టం చేసింది.

ప్రస్తుతం తన తదుపరి సినిమా స్క్రిప్ట్ పనుల్లో బిజీగా గడుపుతున్నట్లు చెప్పింది. త్వరలోనే మళ్లీ నటించబోతున్నట్లు తెలిపింది. అయితే బిగ్ బాస్ షోకి వ్యాఖ్యాతగా వ్యవహరించే ఛాన్స్ వస్తే మాత్రం తప్పకుండా చేస్తానని.. హోస్ట్ గా వ్యవహరించి తనలోని నైపుణ్యాలను మెరుగుపరుచుకోవాలనుకుంటున్నట్లు చెప్పుకొచ్చింది.

మరి ఈమెకు అలాంటి ఛాన్స్ వస్తుందేమో చూడాలి. బిగ్ బాస్ మొదటి సీజన్ కి ఎన్టీఆర్ హోస్ట్ గా పని చేయగా.. రెండో సీజన్ నాని హ్యాండిల్ చేశారు. మూడో సీజన్ హోస్ట్ గా నాగార్జునని రంగంలోకి దింపుతున్నట్లు సమాచారం.