రేణు దేశాయ్, పవన్ కళ్యాణ్ విడాకులు తీసుకుని దాదాపు 10 ఏళ్ళు గడుస్తోంది. తమ ఇద్దరి మధ్య ఏం జరిగిందో రేణు దేశాయ్ కానీ, పవన్ కానీ ఎప్పుడూ ప్రస్తావించలేదు. 

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రేణు దేశాయ్ దంపతులుగా విడిపోయిన సంగతి తెలిసిందే. కానీ పిల్లల కోసం తల్లిదండ్రులుగా కొనసాగుతున్నారు. పవన్ వీలు చిక్కినప్పుడల్లా తన పిల్లలతో గడుపుతుంటారు. ఇక రేణు దేశాయ్ ఎప్పుడూ అకీరా, ఆద్యాతోనే ఉంటుంది.

అయితే అప్పుడప్పుడూ రేణు దేశాయ్ తన గతాన్ని గుర్తు చేసుకుని ఎమోషనల్ అవుతుంటారు. అదే సమయంలో ఆన్లైన్ లో జరిగే ట్రోలింగ్ విషయంలో కూడా ఆమె బాధపడుతుంటారు. రేణు దేశాయ్, పవన్ కళ్యాణ్ విడాకులు తీసుకుని దాదాపు 10 ఏళ్ళు గడుస్తోంది. తమ ఇద్దరి మధ్య ఏం జరిగిందో రేణు దేశాయ్ కానీ, పవన్ కానీ ఎప్పుడూ ప్రస్తావించలేదు. 

తనపై వచ్చిన విమర్శలని రేణు దేశాయ్ ఖండిస్తూ వచ్చింది తప్ప.. అసలేం జరిగిందో అనే విషయం గురించి ఎప్పుడూ మాట్లాడలేదు. కానీ తొలిసారి రేణు దేశాయ్ సంచలన పోస్ట్ పెట్టారు. పవన్ తో విడిపోయిన ఇన్నేళ్లకు తనని అర్థం చేసుకునే వ్యక్తులు ఉన్నారని. ధైర్యం వచ్చింది అంటూ సంచలనం రేపే పోస్ట్ ని రేణు చేశారు. 

రేణు దేశాయ్ ఓ యూట్యూబ్ ఛానల్ లో సోషల్ యాక్టివిస్ట్ కృష్ణ కుమారి తన గురించి, పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడిన వీడియో ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేశారు. ఈ వీడియోలో సోషల్ యాక్టివిస్ కృష్ణ కుమారి పవన్ కళ్యాణ్ గురించి తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. 

భార్య భర్తలు విడిపోయినప్పుడు సమాజం ముందు మహిళలు మాత్రమే ధిక్కార స్వరానికి గురవుతున్నారు అని కృష్ణ కుమారి అన్నారు. పైకి గంభీరంగా కనిపిస్తున్నా అలాంటి మహిళలు ఎంతో వేదన అనుభవిస్తుంటారు అని కృష్ణ కుమారి అన్నారు. ఉదాహరణగా పవన్ కళ్యాణ్, రేణు దేశాయ్ విడిపోవడాన్ని ప్రస్తావించారు. 

హీరో హీరోయిన్లు విడిపోయినప్పుడు ఎక్కువ ట్రోలింగ్ కి గురయ్యేది హీరోయినే. మహిళలు మాత్రమే రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలనే కోణంలో సమాజం ఆలోచిస్తోంది. ఈ కారణంగా మహిళలు మానసిక ఒత్తిడికి గురవుతున్నారు అని తెలిపారు. రేణు దేశాయ్ విషయమే తీసుకోండి.. ఆమె ఎవరినో పెళ్లి చేసుకోబోతోంది అని వార్తలు రాగానే ట్రోలింగ్ మొదలు పెట్టారు. 

పెళ్లి ఎలా చేసుకుంటావ్.. నువ్వు మా వదినవి అంటూ పవన్ ఫ్యాన్స్ ట్రోల్ చేసారు. పవన్ కళ్యాణ్ తో రేణు దేశాయ్ సహజీవనం చేసి ఒక బిడ్డని కనేందుకు కూడా అంగీకరించింది. అలాంటి వ్యక్తిని వదులుకునే అవకాశమే రాకూడదు. రేణు దేశాయ్ పవన్ కళ్యాణ్ కి అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించింది. 

ఆ రోజు రేణు దేశాయ్.. నాకు కొడుకు పుట్టింది సహజీవనం వల్ల కాదు.. ఏ గుడిలోనో, ఇంకెక్కడో పవన్ కళ్యాణ్ నన్ను పెళ్లి చేసుకున్నారు అని స్టేట్మెంట్ ఇచ్చి ఉంటే పవన్ కి జైలు శిక్ష పడేది అంటూ కృష్ణ కుమారి పెను సంచలన వ్యాఖ్యలు చేశారు. దాని నుంచి రేణు దేశాయ్ పవన్ కళ్యాణ్ ని కాపాడింది అని కృష్ణ కుమారి అన్నారు. 

రేణు దేశాయ్ ని పవన్ అభిమానులు ట్రోల్ చేస్తూ.. మా అన్న అయితే ఎన్ని పెళ్లిళ్లు అయినా చేసుకోవచ్చు.. నువ్వు చేసుకోకూడదు అని పవన్ ఫ్యాన్స్ చెప్పినట్లు కృష్ణ కుమారి ఈ ఇంటర్వ్యూలో ఉటంకించారు. ఈ విధంగా మహిళలు మానసిక సంఘర్షణ అనుభవిస్తున్నారు అని కృష్ణ కుమారి తెలిపారు. 

View post on Instagram

ఈ వీడియో రేణు దేశాయ్ షేర్ చేస్తూ.. ఈవిడ ఎవరో నాకు తెలియదు.. నా గురించి ఎందుకుమాట్లాడుతున్నారో కూడా తెలియదు.. కానీ తొలిసారి పబ్లిక్ లో నా తరుపున మాట్లాడడం విని చాలా ఏడ్చాను. నేను ఏదైనా మాట్లాడితే ఎదో ఒక పొలిటికల్ పార్టీకి అమ్ముడయ్యాను అని అంటారు, ఇది ఎలక్షన్ టైం అని అంటారు.. కానీ ఈ వీడియో చూసిన తర్వాత నా భాద అర్థం చేసుకునే వ్యక్తులు ఉన్నారనే ధైర్యం వచ్చింది అంటూ రేణు దేశాయ్ పోస్ట్ చేయడం మరింత చర్చనీయాంశంగా మారింది. రేణు దేశాయ్ చేసిన ఈ పోస్ట్ తో పవన్ వ్యక్తిగత జీవితం గురించి మరోసారి సోషల్ మీడియాలో చర్చ జరిగే అవకాశం ఉంది.