సినీ నటి, పవన్ కల్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ మరోసారి పవన్ అభిమానులపై ఫైర్ అయ్యారు. ట్విట్టర్ నుంచి బయటకు వచ్చాక .. పవన్ అభిమానులు ఇన్ స్టాగ్రామ్ లో మెసేజ్ లు చేస్తున్నారని ఆమె మండిపడ్డారు. 

‘పవన్ కళ్యాణ్ చాలా మంది అమ్మాయిల జీవితాలను నాశనం చేశాడు’’ లాంటి కామెంట్లు రేణుదేశాయ్ చేసినట్లుగా.. ఇటీవల సోషల్ మీడియాలో ఓ ఫోటో చక్కర్లు కొడుతోంది. దీంతో.. ఆ పోస్టు నిజం కాదని చెప్పాలంటూ పవన్ అభిమానులు రేణుకి మెసేజ్ లు చేయడం ప్రారంభించారు. దీంతో.. దీనిపై రేణు ఫేస్ బుక్ వేదికగా స్పందించారు.

 

‘‘నేను చివరకు ఇన్‌స్టాగ్రాం అయినా ప్రశాంతంగా వాడుకోవచ్చు అని భావించాను కానీ జీవితం మొత్తం పూర్తి వ్యతిరేకంగా మారిపోయింది. కొందరు వ్యక్తులు, ఎవరైతే నా తప్పు లేకున్నా, 5సంవత్సరాలుగా నన్ను నిందిస్తున్నారో, వారు నన్ను అన్నీ మరచిపోయి సైలెంట్‌గా ఉండమన్నారు! నేను నా ఆత్మాభిమానం, డిగ్నిటీ కాపాడుకునేందుకు ఏమైనా మాట్లాడితే వీళ్లంతా నన్ను వాటిని ‘సైలెంట్‌గా భరించు’ అన్నారు. నేను మాట్లాడితే నా సినిమాలు.. ఇంకా ఇతర విషయాలకు.. ఫ్రీ పబ్లిసిటీ కోసం మాట్లాడుతున్నట్టు నిందిస్తున్నారు! ఇదంతా పొలిటికల్ గేమ్ అని అవన్నీ పట్టించుకోవద్దని ఒక మంచి వ్యక్తి చెప్పారు.
 
ఇప్పుడు కళ్యాణ్ గారికి వ్యతిరేకంగా, ఒక స్టుపిడ్ పొలిటికల్ పర్సన్ ఒక ఇమేజ్‌ని సర్క్యులేట్ చేస్తున్నాడు. దీని గురించి కొందరు అర్థిస్తూ, కొందరు సభ్యత లేకుండా, కొందరు భయపెడుతూ, మరికొందరు మంచిగా నన్ను ఆ మాటలు తప్పని చెప్పమని అడుగుతున్నారు. ఈ మెసేజ్‌లతో నా ఇన్‌స్టాగ్రాం ఇన్ బాక్స్ నిండిపోయింది. నాకు, పవన్‌కు మధ్య రూల్స్ ఎలా మారుతాయి? 5 సంవత్సరాలుగా నా తప్పు లేకుండా నేను నిందలు పడుతున్నాను కదా. అప్పుడు నా ఆత్మాభిమానం ముఖ్యమనిపించలేదా?
 
ఎప్పుడైతే కల్యాణ్ గారి పేరు ప్రతిష్టలకు భంగం వాటిల్లుతుందో అప్పుడు నేను వచ్చి వాటిని సరి చేయాలా? నేను ఇలాంటి భేదభావంతో కూడిన సంఘంలో జీవిస్తున్నందుకు చాలా బాధపడుతున్నా. ఏదో ఒకరోజు ప్రశాంతత నా చెంతకు చేరుతుందని నేను భావిస్తున్నా! అంతేకాకుండా నేనెప్పుడు కల్యాణ్ గారి గురించి పబ్లిక్‌లో ఎప్పుడూ మాట్లాడను. నా పిల్లల తండ్రి గురించి వ్యతిరేకంగా మాట్లాడమని ఏ రాజకీయ పార్టీ నన్ను ఇన్‌ఫ్లూయెన్స్ చేయలేదు’’ అని పోస్ట్ పెట్టారు రేణు.