అనీల్ రావిపూడి కేక పెట్టించే మార్కటింగ్ స్ట్రాటజీ, దసరాకు దద్దరిల్లాలి
ఈ సినిమా అక్టోబర్ 19న విడుదల కానున్న సంగతి తెలిసిందే. రీసెంట్ విడుదలైన ఈ చిత్ర ట్రైలర్‌కు అభిమానులు, ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభించింది.

సినిమా తీయటం ఒకెత్తు..దాన్ని జనాల్లోకి తీసుకెళ్లి సూపర్ హిట్ కొట్టడం ఒకెత్తు. ఈ విషయం ఇప్పటితరం దర్శకులకు బాగా తెలుసు. అందుకే కథ తయారు చేసుకునే సమయం నుంచే సినిమా మార్కెటింగ్ గురించి ఆలోచిస్తున్నారు..ప్లాన్స్ వేస్తున్నారు. బాలకృష్ణ హీరోగా అనిల్ రావిపూడి తెరకెక్కిస్తోన్న చిత్రం ‘భగవంత్ కేసరి’ (Bhagavanth Kesari). ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. అదే సమయంలో పోటీ కూడా అదే స్దాయిలో ఉంది. ఓప్రక్కన లియో, టైగర్ నాగేశ్వరరావు చిత్రాలు ఇదే సంక్రాతికి వస్తున్నాయి. దాంతో ఓ డిఫరెంట్ స్ట్రాటజీతో సినిమాని మన ముందుకు తీసుకు వస్తున్నారు అనీల్ రావిపూడి. మొన్న వినాయిక చవితి పందిళ్లలో ఈ సినిమాలోని ‘గణపతి బప్పా మోరియా’ పాటను మారు మ్రోగేలా చేసి, కొన్ని రెట్లు పబ్లిసిటీ వచ్చేలా చేసారు. ఇప్పుడు దసరా రోజుల్లో తమ సినిమాని మళ్లీ మళ్లీ చూసేలా అనీల్ ప్లాన్ చేసినట్లు సమాచారం.
ఈ సినిమా అక్టోబర్ 19న విడుదల కానున్న సంగతి తెలిసిందే. రీసెంట్ విడుదలైన ఈ చిత్ర ట్రైలర్‌కు అభిమానులు, ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభించింది. ఇదిలా ఉంటే, సినిమా బాక్సాఫీస్ రిజల్ట్ ని రెట్టింపు చేయటానికి దర్శకుడు అనిల్ రావిపూడి చాలా ప్రయత్నాలు చేస్తున్నాడు. సినిమా ప్రమోషన్స్ సందర్భంగా, సినిమాలో రీమిక్స్ పాటలు ఉంటాయని, అయితే సినిమా ప్రారంభ రోజుల్లో వాటిని జోడించబోమని అనిల్ స్పష్టం చేశారు. . సినిమా సాంగ్స్, డ్యుయెట్స్ ఉండవు. కథ డిమాండ్ చేయట్లేదు. నేచురల్‌గా సినిమా తీశాం. లాస్ట్‌లో మాత్రం ఓ సాంగ్ పెట్టం. అది సిట్యూయేషన్‌కు కుదిరింది అన్నారు.
అలాగే ఇప్పటివరకు ఆ రీమిక్స్ సాంగ్ ని అయితే రిలీజ్ చేయలేదు. అలాగే సినిమా మొదటి వారంలో కూడా ఈ పాట ఉండదు డైరెక్ట్ గా దసరా వీక్ లో అయితే యాడ్ చేస్తున్నామని ఇది కంప్లీట్ మాస్ ఫీస్ట్ గా ఉంటుంది అని అనీల్ కన్ఫర్మ్ చేసాడు. భగవంత్ కేసరి ప్రయాణం అద్భుతమైనదని, భావోద్వేగంతో కూడుకున్నదని ఆయన స్పష్టం చేశారు. కాబట్టి తాను మరియు టీమ్ ప్రేక్షకులకు సినిమా ఫ్లోకి అంతరాయం కలిగించకూడదని, దసరా పండుగ రోజుల్లో రీమిక్స్ పాటలను జోడిస్తామని అనిల్ రావిపూడి అన్నారు. కాబట్టి ఇది అద్భుతమైన స్ట్రాటజీ. ఎందుకంటే ఫ్యాన్స్, ప్రేక్షకులు ఖచ్చితంగా ఫస్ట్ వీకెండ్ లో సినిమాను చూసేస్తారు మరియు రీమిక్స్ పాట కారణంగా వారు పండుగ రోజుల్లో రిపీట్ ప్రేక్షకులుగా మారతారు.
‘అఖండ’, ‘వీరసింహారెడ్డి’లతో వరుసగా బ్లాక్ బస్టర్ విజయాలను అందుకున్న బాలకృష్ణ (Balakrishna)ఈ సినిమాతో హ్యాట్రిక్ విజయాన్ని అందుకోవాలని ఫ్యాన్స్ ఆశపడుతున్నారు. ఇప్పటికే దీని టీజర్‌కు భారీ స్పందన రాగా.. తాజాగా విడుదల చేసిన ట్రైలర్ కూడా మిలియన్ వ్యూవ్స్‌తో యూట్యూబ్‌లో సందడి చేస్తోంది. బాలకృష్ణ మార్క్ యాక్షన్ అంశాలతో పాటు అనిల్ శైలి వినోదాలతో మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రం ముస్తాబవుతోంది. ఇందులో కాజల్ హీరోయిన్ గా నటిస్తుండగా.. శ్రీలీల, అర్జున్ రాంపాల్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.