Asianet News TeluguAsianet News Telugu

రెజీనా, నివేతా 'శాకిని డాకిని' ఫన్ అండ్ థ్రిల్లింగ్ టీజర్ ఇదిగో.. ఇద్దరూ రెచ్చిపోయారుగా

హీరోలు మాత్రమే కాదు హీరోయిన్లు కూడా మల్టీస్టారర్ చిత్రాలు చేస్తున్నారు. హాట్ బ్యూటీలు నివేత థామస్, రెజీనా కసాండ్ర కలసి నటిస్తున్న చిత్రం 'శాకిని డాకిని'. స్వామిరారా ఫేమ్ సుధీర్ వర్మ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది.

Regina and Nivetha Saakini Daakini Official Teaser
Author
First Published Aug 23, 2022, 12:22 PM IST

హీరోలు మాత్రమే కాదు హీరోయిన్లు కూడా మల్టీస్టారర్ చిత్రాలు చేస్తున్నారు. హాట్ బ్యూటీలు నివేత థామస్, రెజీనా కసాండ్ర కలసి నటిస్తున్న చిత్రం 'శాకిని డాకిని'. స్వామిరారా ఫేమ్ సుధీర్ వర్మ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. సురేష్ బాబు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 

తాజాగా విడుదలైన టీజర్ నెటిజన్లని విశేషంగా ఆకట్టుకుంటోంది. సుధీర్ వర్మ ఈ చిత్రాన్ని ఫన్ అండ్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో తెరకెక్కించినట్లు ఉన్నారు. నివేతా, రెజీనా ఇద్దరూ పోటీ పడిమరీ రచ్చ చేశారు. త్వరలో కాబోయే పోలీస్ అధికారులుగా, అకాడమీలో ట్రైనింగ్ తీసుకుంటున్న పాత్రల్లో వీరిద్దరూ నటిస్తున్నారు. ఇద్దరిదీ డిఫెరెంట్ మైండ్ సెట్. నివేతా ఫుడ్ ని బాగా ఇష్టపడే అమ్మాయిగా, రెజీనా పరిశుభ్రత అంటే పడిచచ్చే యువతిగా నటిస్తున్నారు. 

టీజర్ లో చూపించిన ఫన్ ఎలిమెంట్స్ బాగా ఆకట్టుకుంటున్నాయి. అకాడమీ ట్రైనింగ్ లో ఉన్న వీరిద్దరికి ఎదురైనా ఊహించని సమస్యే ఈ చిత్ర కథ. కామెడీ మాత్రమే కాదు యాక్షన్ సీన్స్ లో కూడా రెజీనా, నివేత అదరగొడుతున్నారు. 

ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 16న రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు. మిడ్ నైట్ రన్నర్స్ అనే కొరియన్ చిత్రానికి రీమేక్ గా ఈ మూవీ తెరకెక్కుతోంది. రణరంగం ఫ్లాప్ తర్వాత సుధీర్ వర్మ తనని తాను నిరూపించుకునేందుకు ఈ చిత్రంతో వస్తున్నారు. 

 

Follow Us:
Download App:
  • android
  • ios