అతిలోక సుందరి శ్రీదేవి కుమార్తె గా జాన్వీ కపూర్ బాలీవుడ్ లోకి అడుగుపెట్టింది. హీరోయిన్ గా జాన్వీ కపూర్ క్రేజ్ రోజు రోజుకు పెరుగుతోంది. ఇదిలా ఉండగా జాన్వీ కపూర్ సౌత్ లో కూడా నటించాలనే డిమాండ్ పెరుగుతోంది. శ్రీదేవి బాలీవుడ్ తో పాటు సౌత్ లో కూడా తిరుగులేని హీరోయిన్ గా నటించింది. ఓ మంచి అవకాశం వస్తే సౌత్ లోకి అడుగుపెట్టాలనే ఆలోచనలో జాన్వీ కపూర్ ఉంది. 

జాన్వీ కపూర్ కు దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆర్ఆర్ఆర్ చిత్రంలో ఎన్టీఆర్ కు హీరోయిన్ గా నటించే అవకాశం వచ్చినట్లు మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. సౌత్ సినిమాల్లో నటించాలంటే జాన్వీ కపూర్ కు ఇంతకు మించిన బంపర్ ఆఫర్ దొరకదు. కానీ జాన్వీ కపూర్ ఆర్ఆర్ఆర్ చిత్రాన్ని రిజెక్ట్ చేసినట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. 

ఈ క్రేజీ ప్రాజెక్ట్ ని రిజెక్ట్ చేయడానికి కారణం లేకపోలేదని అంటున్నారు. ఈ చిత్రంలో ఎన్టీఆర్ హీరోయిన్ పాత్రకు పెద్దగా ప్రాధాన్యత ఉండదని అందువల్లే జాన్వీ రిజెక్ట్ చేసిందని కొందరు అంటున్నారు. మరో వాదన ప్రకారం.. గతంలో శ్రీదేవి బాహుబలి చిత్రాన్ని రిజెక్ట్ చేసింది. దీనితో రాజమౌళి శ్రీదేవికి బదులుగా రమ్యకృష్ణని తీసుకున్నారు. 

సినిమా విజయం సాధించిన తర్వాత రమ్యకృష్ణని కాకుండా ఇంకెవరిని తీసుకుని ఉన్నా పెద్ద పొరపాటు జరిగిపోయేదని రాజమౌళి వ్యాఖ్యానించారు. ఆ మాటలకు శ్రీదేవి హర్ట్ కావడం, రాజమౌళి క్షమాపణ చెప్పడం జరిగిపోయింది. ఈ మొత్తం ఎపిసోడ్ వల్లే జాన్వీ కపూర్ ఆర్ఆర్ఆర్ చిత్రాన్ని రిజెక్ట్ చేసిందనేది జోరుగా జరుగుతున్న ప్రచారం. ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందో జాన్వీ స్పందిస్తే కానీ తెలియదు.