‘‘అన్నయ్యా! ఆల్రెడీ నెల రోజుల ఫుటేజ్‌ మిస్‌ అయింది’’ అని కొరటాల అన్నారు. కంగారుపడకండి...ఇదేమీ చిరంజీవితో తీస్తున్న ఆచార్య సినిమా ఫుటేజ్ కాదు. కొరటాల శివ తన ఇంట్లో చేస్తున్న పనులకు సంభందించిన ఫుటేజ్ మిస్ అయ్యిందని ఫన్ చేసారు.  అసలు విషయానికొస్తే, ‘బి ద మ్యాన్‌ ఛాలెంజ్‌..’ అంటూ యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌, కొరటాల శివని నామినేట్‌ చేశాడు. ‘ఇంటి పనులు చేయడం’ ఈ ఛాలెంజ్‌ ముఖ్య ఉద్దేశ్యం. 

‘‘మన ఇంటిలో ప్రేమలు, ఆప్యాయతలే కాదు... పనులు కూడా పంచుకుందాం’’ అని ప్రజలకు ఎన్టీఆర్‌ పిలుపునిచ్చారు. ‘బీ ది రియల్‌మెన్‌’ ఛాలెంజ్‌లో ఆయన పార్టిసిపేట్‌ చేశారు. దర్శకుడు రాజమౌళి విసిరిన సవాల్‌ను స్వీకరించిన ఆయన, ఇంటి పనులు చేశారు. బకెట్‌లో నీళ్లు పట్టి ఇల్లంతా మాప్‌ కొట్టి, చీపురుతో వాకిలి అంతా శుభ్రం చేసి, పొడి గుడ్డ పట్టి కడిగిన పాత్రలను చక్కగా తుడిచిన వీడియో సోషల్‌ మీడియాలో ఎన్టీఆర్‌ షేర్‌ చేశారు. ఇంటిలో పని ఒత్తిడిని పంచుకున్నప్పుడు సరదాగా ఉంటుందని ఆయన అన్నారు. 

‘‘ఈ ఛాలెంజ్‌లో పాల్గొనవలసిందిగా బాలా బాబాయ్‌ (నందమూరి బాలకృష్ణ), చిరంజీవిగారు, నాగార్జున బాబాయ్‌, వెంకటేశ్‌గారు, కొరటాల శివగారిని నామినేట్‌ చేస్తున్నా’’ అని ఎన్టీఆర్‌ తెలిపారు. ఆయన సవాల్‌ను స్వీకరిస్తున్నట్టు దర్శకుడు కొరటాల శివ తెలిపారు. ఈ సందర్బంగా ట్విట్టర్ లో ఈ సంభాషణ జరిగిందన్నమాట. ఇక ‘ఛాలెంజ్‌’లో సినిమాలో తాను చెప్పిన ‘ఇట్స్‌ మై ఛాలెంజ్‌’ డైలాగును ట్వీట్‌ చేస్తూ... ఎన్టీఆర్‌ సవాల్‌ను స్వీకరిస్తున్నట్టు మెగాస్టార్‌ చిరంజీవి తెలిపారు.