Asianet News TeluguAsianet News Telugu

`రావణాసుర` ఓటీటీ రైట్స్.. ఎందులో రాబోతుందంటే ?

రవితేజ త్వరలో `రావణాసుర` చిత్రంతో ఆడియెన్స్ ముందుకు రాబోతున్నారు. ఈ సినిమా బిజినెస్‌ గట్టిగానే జరుగుతున్నట్టు తెలుస్తుంది. తాజాగా ప్రముఖ ఓటీటీ సంస్థ డిజిటల్‌ హక్కులను సొంతం చేసుకుందట. 
 

raviteja ravanasura movie ott rights details  arj
Author
First Published Mar 29, 2023, 7:39 PM IST

మాస్‌ మహారాజా రవితేజ ఇటీవల `ధమాఖా` చిత్రంతో సక్సెస్‌ అందుకున్నాడు. ఇప్పుడు `రావణాసుర` చిత్రంతో రాబోతున్నారు. ఈ చిత్రం సుధీర్‌ వర్మ దర్శకత్వంలో రూపొందిన చిత్రమిది. వచ్చే నెల మొదటి వారంలో విడుదల కాబోతుంది. ఇక నిన్న(మంగళవారం) విడుదలైన ట్రైలర్‌ ఆద్యంతం ఆకట్టుకుంటుంది. సినిమాపై అంచనాలు పెంచింది. రవితేజ పాత్ర ఆద్యంతం గూస్‌ బంమ్స్ తెప్పించేలా ఉంది. ఆయనే హీరోగా, ఆయనే విలన్‌గా రెండు రకాల షేడ్స్ చూపించేలా ట్రైలర్‌ సాగడం విశేషం. 

యాక్షన్‌ ఫ్యాక్డ్ మూవీగా `రావణాసుర` రాబోతుందని అర్థమవుతుంది. దీంతోపాటు రవితేజ మార్క్ కామెడీ, డ్రామా, థ్రిల్లర్‌ అంశాలు మేళవింపుగా సినిమా ఉండబోతుందని ట్రైలర్‌ చూస్తే తెలుస్తుంది. ఇందులో రవితేజ క్రిమినల్‌ లాయర్‌గా నటిస్తున్నారు. ఆయన లాని అడ్డుపెట్టుకుని క్రైమ్‌కి పాల్పడుతున్నట్టు తెలుస్తుంది. మరి ఆయన చేసే క్రైమ్‌ మంచి కోసమా? చెడు కోసమా అనేది తెలియాల్సి ఉంది. ఇందులో నెగటివ్‌ రోల్‌లో హీరో సుశాంత్‌ నటిస్తున్నారు. వీరితోపాటు ఫరియా అబ్దుల్లా, మేఘా ఆకాష్‌, అను ఇమ్మాన్యుయెల్‌, దక్షా నాగర్కర్, పూజిత పొన్నాడ, రావు రమేష్, మురళీ శర్మ, సంపత్ రాజ్, నితిన్ మెహతా (అఖండ ఫేమ్), సత్య, జయ ప్రకాష్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. 

ఇదిలా ఉంటే ఈ సినిమాకి సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్‌ అప్‌డేట్‌ బయటకు వచ్చింది. సినిమా ఓటీటీ రైట్స్ ని అమెజాన్‌ ప్రైమ్‌ దక్కించుకుందని తెలుస్తుంది. భారీ రేటుకి `రావణాసుర` డిజిటల్‌ రైట్స్ సొంతం చేసుకుందట. ఈ సినిమా విడుదలైన ఐదు నుంచి ఎనిమిది వారాల మధ్యలో టెలికాస్ట్ అయ్యే అవకాశం ఉందని సమాచారం. ఇదిలా ఉంటే ఈ సినిమా ఇప్పటికే ప్రీ రిలీజ్‌ బిజినెస్‌ పూర్తయ్యిందని, రూ.40కోట్లకుపైగానే థియేట్రికల్‌ రైట్స్ అమ్ముడు పోయినట్టు సమాచారం. దీనిపై స్పష్టత రావాల్సి ఉంది. రవితేజ `ధమాఖా` మూవీ గట్టిగానే వసూలు చేసింది. దీంతో ఆయన మార్కెట్‌ కూడా పెరిగింది. ఈ నేపథ్యంలో `రావణాసుర` రైట్స్ కోసం బయ్యర్లు పోటీపడుతున్నారని సమాచారం. 
 

Follow Us:
Download App:
  • android
  • ios