Asianet News TeluguAsianet News Telugu

థియేటర్స్ లోనే దిగుతానంటున్న ఖిలాడి!

ఖిలాడి చిత్రం ఓటిటి లో విడుదల చేయనున్నారని కథనాలు రావడం జరిగింది. అయితే ఖిలాడి మూవీ ఓటిటి లో విడుదల చేసే ఆలోచన లేదని యూనిట్ స్పష్టత ఇచ్చారు.

raviteja khiladi team not interested in ott conforms its a theatrical release ksr
Author
Hyderabad, First Published May 16, 2021, 5:24 PM IST

రవితేజ ఖిలాడి టీమ్ పుకార్లకు చెక్ పెట్టే ప్రయత్నం చేశారు.  ఖిలాడి ఓటిటి లో విడుదలకు సన్నాహాలు చేస్తున్నారని వార్తలు వస్తున్న నేపథ్యంలో స్పష్టత ఇచ్చారు. దర్శకుడు రమేష్ వర్మ తెరకెక్కిస్తున్న ఖిలాడి షూటింగ్ చివరి దశలో ఉంది. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ యాక్షన్ ఎంటర్టైనర్ ని సమ్మర్ కానుకగా మే 28న విడుదల చేయాలని భావించారు. అయితే కరోనా సెకండ్ వేవ్ ప్రారంభం కావడంతో షూటింగ్ కి బ్రేక్ పడడంతో పాటు విడుదల వాయిదా వేశారు. 

కరోనా సెకండ్ వేవ్ ఉధృతంగా ఉన్న తరుణంలో థియేటర్స్ ఇప్పట్లో తెరుచుకునే మార్గం కనిపించడం లేదు. దీంతో ఖిలాడి చిత్రం ఓటిటి లో విడుదల చేయనున్నారని కథనాలు రావడం జరిగింది. అయితే ఖిలాడి మూవీ ఓటిటి లో విడుదల చేసే ఆలోచన లేదని యూనిట్ స్పష్టత ఇచ్చారు. ఖిలాడి థియేటర్స్ లో మాత్రమే విడుదల అవుతుందంటూ ప్రత్యేక పోస్టర్ విడుదల చేశారు. దీంతో ఖిలాడి మూవీ విడుదలపై వస్తున్న పుకార్లకు చెక్ పెట్టినట్లు అయ్యింది.

 
ఖిలాడి చిత్రంలో మీనాక్షి చౌదరి, డింపుల్ హయాతి హీరోయిన్స్ గా నటిస్తుండగా దేవిశ్రీ సంగీతం అందిస్తున్నారు. ఇటీవల విడుదలైన ఖిలాడి టీజర్ విశేష ఆదరణ దక్కించుకుంది. హాట్ యాంకర్ అనసూయ ఖిలాడి మూవీలో ఓ కీలక రోల్ చేయడం విశేషం. ఇక సంక్రాంతి కానుకగా విడుదలైన క్రాక్ మూవీతో రవితేజ భారీ హిట్ అందుకున్నాడు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios